News January 10, 2025
ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించాలి: మంత్రి బీసీ
బనగానపల్లెలోని ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. బనగానపల్లె పంచాయతీ కార్యాలయంలో రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని తాగునీటి సమస్యతో పాటు పారిశుద్ధ్య అంశంపై సంబంధిత అధికారులతో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. బనగానపల్లె వాసులకు పంచాయతీ ద్వారా మెరుగైన సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు.
Similar News
News January 11, 2025
భూ సమస్యలకు పరిష్కారం చూపండి: నంద్యాల కలెక్టర్
భూ రికార్డులలో మ్యూటేషన్ల దిద్దుబాటు, రెవెన్యూ సదస్సుల్లో భూ పరిష్కార నిమిత్తం స్వీకరించిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి మండల తహశీల్దార్లు, ఆర్డీవోలను ఆదేశించారు. నిర్ణీత కాలపరిమితిలోగా పరిష్కార మార్గాలు చూపాలని అన్నారు. శుక్రవారం నంద్యాల కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో జాయింట్ కలెక్టర్ సి.విష్ణు చరణ్‌తో కలిసి భూ సంబంధిత అంశాలపై సమీక్ష నిర్వహించారు.
News January 10, 2025
కల్లూరు: ‘రాష్ట్ర ప్రజలపై మరోసారి విద్యుత్ భారం ఉండదు’
రాష్ట్ర ప్రజలపై 2025-26 సంవత్సరానికి సంబంధించి విద్యుత్ భారం మరోసారి ఉండే అవకాశం లేదని ఏపీఈఆర్సీ ఛైర్మన్ ఠాకూర్ రామ్ సింగ్, పీవీఆర్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం విద్యుత్ టారిఫ్ పెంపుపై నగరంలోని కల్లూరు ఏపీఈఆర్సీ భవన్లో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో విజయవాడ నుంచి ఛైర్మన్ ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ వర్గాల ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించారు.
News January 10, 2025
శ్రీశైల క్షేత్రంలో భక్తుల రద్దీ
శ్రీశైలంలో భక్తుల రద్దీ నెలకొంది. ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో శ్రీశైలానికి తరలివచ్చారు. శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనార్థమై ఆలయ క్యూలైన్లలో బారులు తీరారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది.