News March 23, 2025
ప్రజలకు విద్య, వైద్యం చాలా ముఖ్యం: శబరీష్

నేటి సమాజంలో ప్రజలకు విద్య వైద్యం ఎంతో ముఖ్యమని ములుగు ఎస్పీ శబరీష్ అన్నారు. వాజేడు మండలం కొంగాల గ్రామంలో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య ఆరోగ్య శిబిరాన్ని శనివారం ఎస్పీ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల శ్రేయస్సు పోలీసుల ప్రథమ కర్తవ్యం అని ఎస్పీ అన్నారు. సమాజంలోని యువత చెడు వ్యసనాలకు బానిస కాకూడదని, వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Similar News
News March 27, 2025
సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్

TG: రాష్ట్రంలో ఎక్కడైనా 100% రుణమాఫీ జరిగిందా అని అసెంబ్లీలో ప్రభుత్వాన్ని KTR నిలదీశారు. సిరిసిల్ల లేదా కొడంగల్‌లో ఎక్కడైనా నిరూపిస్తారా అని ప్రశ్నించారు. నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని CM రేవంత్‌కు సవాల్ విసిరారు. మరోవైపు అనుమతి లేకుండా డ్రోన్ ఎగురవేయడం సబబేనా అని ప్రశ్నించారు. ఒకరిని జైలుకు పంపే అధికారం CMకు ఉండదని, నేరాలు నిర్ధారించి జైలుకు పంపేది కోర్టులని స్పష్టం చేశారు.
News March 27, 2025
పార్వతీపురం: రిపోర్టర్‌లు కావలెను

పార్వతీపురం మన్యం జిల్లాలో Way2Newsలో పనిచేసేందుకు రిపోర్టర్‌లు కావలెను. మీడియా రంగంలో అనుభవం ఉన్న వారు మాత్రమే అర్హులు. మీ వివరాలను <
News March 27, 2025
ఏప్రిల్ 1 నుంచి మీటర్ రీడర్లు రాష్ట్ర వ్యాప్త సమ్మె

ఏప్రిల్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్త మీటర్ రీడర్లు సమ్మె నిర్వహించనున్నట్లు ఏపీ విద్యుత్ మీటర్ రీడర్లు రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు బాల కాశి అన్నారు. గురువారం విశాఖ ఈపీడీసీఎల్ జోనల్ కార్యాలయంలో ఈపీడీసీఎల్ సీఎండీకి డిమాండ్ల పత్రం అందజేశారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక ఉద్యోగ వ్యతిరేక విధానాలను విడనాడాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు.