News March 7, 2025
ప్రజలకు సాయం చేస్తామని ధైర్యం కల్పించాలి: సీపీ

పోలీసులు ఉన్నారు.. మనకు సాయం చేస్తారనే ధైర్యం ప్రజలకు కల్పించాలని సీపీ అంబర్ సిబ్బందికి సూచించారు. కమిషనరేట్ పరిధిలో పిట్రొకర్, ఇంట్రెస్ట్ స్పెక్టర్, హైవే పెట్రోలింగ్ విధుల పోలీస్ సిబ్బందితో సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఏ విధమైన విధులు నిర్వహిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదు వచ్చిన వెంటనే సిబ్బంది స్పందించి ఫిర్యాదు వద్దకు చేరుకొని వారి సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
Similar News
News September 16, 2025
CLAT-2026కు దరఖాస్తు చేశారా?

జాతీయ స్థాయిలో న్యాయవిద్య కోసం CLAT-2026కు దరఖాస్తులు కోరుతున్నారు. నేషనల్ లా యూనివర్సిటీల్లో UG, PG కోర్సుల్లో ప్రవేశాలకు OCT-31వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ. 4000, SC, ST, దివ్యాంగులు రూ. 3,500 చెల్లించాల్సి ఉంటుంది. DEC 7న పరీక్ష నిర్వహించనున్నారు. UG కోర్సులకు ఇంటర్, PG కోర్సులకు LLB డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
News September 16, 2025
మైథాలజీ క్విజ్ – 7

1. మహావిష్ణువు ద్వారపాలకులెవరు?
2. అయోధ్య నగరం ఏ నది ఒడ్డున ఉంది?
3. భీష్ముడి అసలు పేరేంటి?
4. గంగోత్రి ఆలయం ఏ రాష్ట్రంలో ఉంది?
5. భాద్రపద మాసంలో చవితి రోజున వచ్చే పండుగ ఏది?
– సరైన సమాధానాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. పై ప్రశ్నలకు జవాబులను మైథాలజీ క్విజ్ – 8 (రేపు 7AM)లో పబ్లిష్ చేస్తాం.
<<17697694>>మైథాలజీ క్విజ్-6 <<>>జవాబులు: 1.18 వేలు 2.దండకారణ్యం 3.మధుర 4.గుజరాత్ 5.రాఖీ
News September 16, 2025
సిక్కోలు జిల్లాలో డీఎస్సీకి ఎంతమంది ఎంపికయ్యారంటే ?

శ్రీకాకుళం జిల్లాలో డీఎస్సీ-2025లో ఎంపికైన జాబితాను తాజాగా విద్యాశాఖ వెల్లడించింది. జిల్లాలో 543 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి పరీక్ష నిర్వహించగా 535 మంది ఎంపికయ్యారు. ఇందులో ఎస్ఏ-391, ఎస్జీటీ-144 మంది ఎంపికయ్యారని అధికారులు వెల్లడించారు. ఎంపికైన వారికి ఈనెల 19న విజయవాడలో సీఎం చంద్రబాబు నాయుడు చేతులు మీదుగా నియామకపత్రాలు అందించనున్నారు.