News March 28, 2024

ప్రజలకు సేవ చేయాలన్న స్పష్టమైన విజన్‌తో ఉన్నా: తాండ్ర

image

ఈ గడ్డ బిడ్డగా తాను 30 ఏళ్ల పాటు వ్యాపార, సాంకేతిక, సేవా రంగాల్లో గడించిన అనుభవంతో సేవ చేయాలన్న స్పష్టమైన విజన్‌తో ఉన్నట్లు బీజేపీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు చెప్పారు. గురువారం కొత్తగూడెం బీజేపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో పరిశ్రమల అభివృద్ధికి కృషి చేస్తానని, తద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని తెలిపారు. కొత్తగూడెం ప్రజలకు ఇళ్ల పట్టాల క్రమబద్ధీకరణ చేస్తానన్నారు.

Similar News

News March 10, 2026

ఖమ్మం: ‘ప్రజాపాలన’ పనులపై సీఎస్‌ సమీక్ష

image

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు మంగళవారం HYD నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’పై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఖమ్మం జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ తన క్యాంపు కార్యాలయం నుంచి ఈ సమీక్షలో పాల్గొన్నారు. 99 రోజుల ప్రణాళికలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిని, ప్రజా సమస్యల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలను సీఎస్‌ ఈ సందర్భంగా అధికారులకు వివరించారు.

News March 10, 2026

నక్షా లేని గ్రామాల్లో రీ-సర్వే.. సొంత భవనాల్లోకి కార్యాలయాలు

image

రాష్ట్రంలో భూ లావాదేవీల్లో పారదర్శకత పెంచేందుకు అత్యాధునిక ‘రోవర్’ పరికరాలతో రీ-సర్వే నిర్వహించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, Dy.CM భట్టి విక్రమార్క వెల్లడించారు. మంగళవారం HYDలో వారు మాట్లాడుతూ.. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖలను సమన్వయం చేస్తూ కొత్త పోర్టల్ తీసుకువస్తామన్నారు. అలాగే సొంత భవనాలు లేని ఆర్డీవో, తహశీల్దార్ కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మిస్తామని ప్రకటించారు.

News March 10, 2026

ఖమ్మంలో మార్చి 12న ప్రజాప్రతినిధులకు శిక్షణ

image

ఖమ్మంలో భక్తరామదాసు కళాక్షేత్రంలో గురువారం సర్పంచ్‌లు, మున్సిపల్ ఛైర్‌పర్సన్‌లు, వార్డు కౌన్సిలర్లకు ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికపై శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. మంగళవారం సీఎస్ కె.రామకృష్ణారావు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఆయన కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పారు. ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల అమలుపై అవగాహన కల్పించారు.