News February 6, 2025

ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండాలి: నంద్యాల కలెక్టర్

image

బాధ్యతలు స్వీకరించిన ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ప్రజలతో అనుకూల దృక్పథం కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి వెల్లడించారు. బుధవారం నంద్యాల కలెక్టరేట్ హాల్‌లో లైఫ్ కోచ్ మోటివేషన్ స్పీకర్ డాక్టర్ ఎన్.రాంబాబు స్ట్రేస్ మేనేజ్‌మెంట్, పాజిటివ్ థింకింగ్‌పై ఉద్యోగులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రాంబాబు మానసిక ఒత్తిడి, శారీరిక ఒత్తిడి తగ్గించుకునే అంశాలపై క్షుణ్ణంగా వివరించారు.

Similar News

News October 17, 2025

తడిలో చేతిపై ముడతలు.. ఇందుకేనట!

image

నీటిలో కొద్దిసేపు ఉండగానే చేతులు, పాదాలపై ముడతలు ఏర్పడటం చూస్తుంటాం. ఈ ప్రక్రియను ఓస్మోటిక్ వ్యాప్తి అంటారని శాస్త్రవేత్తలు తెలిపారు. నీటిలో ఉన్న వస్తువులను పట్టుకోవడానికి ఇవి సహాయపడతాయని చెబుతున్నారు. ‘శరీరంలోని అటానమిక్ నెర్వస్ సిస్టమ్ రక్త నాళాలను సంకోచింపజేయడం ద్వారా ముడతలు ఏర్పరుస్తుంది. ఆదిమానవులు తడి వాతావరణంలో ఆహారం సేకరించేందుకు ఇవి ఉపయోగపడేవి’ అని అభిప్రాయపడ్డారు.

News October 17, 2025

ధ‌ర్మ‌వ‌రం పోలీసుల అదుపులో ఉగ్ర‌వాద సానుభూతిప‌రులు?

image

ధర్మవరంలో ఇటీవల అరెస్టయిన ఉగ్రవాద సానుభూతిపరుడు నూర్ మహ్మద్ ఇచ్చిన సమాచారం మేరకు మరో ఇద్దరు ఉగ్రవాద సానుభూతిప‌రులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్రకు చెందిన తౌఫిక్ షేక్ అస్లాం, ఉత్తరప్రదేశ్‌కు చెందిన సజ్జద్ హుస్సేన్‌ల అరెస్ట్ చేసినట్లు తెలిసింది. నేడు వారిని అరెస్ట్ చూపి రిమాండ్‌‌కు తరలించే అవకాశం ఉంది.

News October 17, 2025

కర్నూలు మోదీ సభ హైలైట్స్

image

★ చంద్రబాబు నాయకత్వంలో సరికొత్త శక్తిగా ఏపీ: పీఎం మోదీ
★ మోదీ సంస్కరణలు గేమ్ చేంజర్లు: సీఎం
★ మోదీ ఓ కర్మయోగి.. మరో 15ఏళ్లు కూటమి పాలన: డిప్యూటీ సీఎం
★ ప్రధాని కోరినవన్నీ ఇస్తున్నారు: లోకేశ్
★ అఖండ భారతావని బాగుండాలని శ్రీశైలంలో మోదీ పూజలు
★ లోకేశ్‌కు ప్రధాని కితాబు.. సరదా ముచ్చట
★ ₹13,429 కోట్ల పనులకు శ్రీకారం
★ టైం అంటే టైం.. షెడ్యూల్ ప్రకారమే సాగిన పర్యటన
★ సభలో 2 లక్షల మంది పాల్గొన్నారని అంచనా