News February 6, 2025

ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండాలి: నంద్యాల కలెక్టర్

image

బాధ్యతలు స్వీకరించిన ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ప్రజలతో అనుకూల దృక్పథం కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి వెల్లడించారు. బుధవారం నంద్యాల కలెక్టరేట్ హాల్‌లో లైఫ్ కోచ్ మోటివేషన్ స్పీకర్ డాక్టర్ ఎన్.రాంబాబు స్ట్రేస్ మేనేజ్‌మెంట్, పాజిటివ్ థింకింగ్‌పై ఉద్యోగులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రాంబాబు మానసిక ఒత్తిడి, శారీరిక ఒత్తిడి తగ్గించుకునే అంశాలపై క్షుణ్ణంగా వివరించారు.

Similar News

News January 23, 2026

పల్నాడులో ఈ ఆలయాలను సంరక్షించాలి

image

మాచవరం మండలం రేగులగడ్డ గ్రామంలో ఉన్న పురాతన శిధిల ఆలయాలు హిందూ సనాతన ధర్మానికి చారిత్రక సాక్ష్యాలు. వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయాలు మన సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని చాటుతున్నాయి. కాలక్రమేణా శిథిలావస్థకు చేరుకున్న ఈ ఆలయాలను సంరక్షించి పునరుద్ధరించడం అత్యంత అవసరం. భవిష్యత్ తరాలకు ఈ వారసత్వాన్ని అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

News January 23, 2026

గుంటూరు జిల్లాలో భారీ మోసం

image

నల్లపాడు GDCC బ్యాంకులో రూ.30కోట్ల పైగా ఆర్థిక మోసానికి పాల్పడిన 2 కేసుల్లో 5గురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. బ్యాంకు ఛైర్మన్, ఉద్యోగులు, కోల్డ్ స్టోరేజ్ ఓనర్స్, మిర్చి వ్యాపారులు, నకిలీ రైతులు మొత్తం 270మంది నిందితులుగా గుర్తించామని అన్నారు. బ్యాంక్ మేనేజర్ అరుణకుమారి, కమిటీ సభ్యుడు గోవింద్, మిర్చి వ్యాపారి రామచంద్రరావు, కోల్డ్ స్టోరేజ్ నాగిరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి అరెస్టయ్యారు.

News January 23, 2026

ఇందుకూరు: అటవీశాఖ ఉద్యోగి ఆకస్మిక మృతి

image

ఇందుకూరు రేంజ్ పరిధిలో ఇందుకూరు ఫారెస్టు బీట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న విజయదుర్గ శుక్రవారం ఉదయం మృతి చెందారు. విజయదుర్గ అకాల మరణంతో అటవీశాఖ అధికారులు, సిబ్బంది, సహచర ఉద్యోగులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆమె మృతికి తీవ్ర సంతాపం తెలిపారు. ఆమె అంత్యక్రియలు స్వగ్రామమైన రాజవొమ్మంగిలో జరగనున్నాయి.