News January 28, 2025

ప్రజలను ఇబ్బందులకు గురి చేసే వారి పట్ల కఠినంగా ఉండాలి: సీపీ

image

ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని వరంగల్‌ సీపీ అంబర్ కిషోర్ ఝా పోలీస్‌ అధికారులకు సూచించారు. నెలవారీ సమీక్షలో భాగంగా వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో మంగళవారం పోలీస్‌ అధికారులతో సీపీ నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. డీసీపీలు, ఏఎస్పీ, ఏసీపీలు, సీఐలు పాల్గొన్నారు.

Similar News

News November 24, 2025

ఏలూరు: గంటల వ్యవధిలో ఒకే కుటుంబంలో ఇద్దరి మృతి

image

జీలుగుమిల్లి (M)కామయ్యపాలెం సమీపంలో వాగులో స్నానానికి దిగి తెలంగాణలోని అశ్వారావుపేటకు చెందిన బాలుడు మృతి చెందిన విషయం తెలిసిందే. స్నేహితులతో వాగులో స్నానానికి వెళ్లిన పదో తరగతి విద్యార్థి యశ్వంత్ (15) ఈత రాక మునిగి మృతి చెందగా.. మనుమడి మరణవార్త విని తట్టుకోలేక నాయనమ్మ వెంకమ్మ (65) గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయింది. గంటల వ్యవధిలో ఒకే ఇంట్లో ఇద్దరు చనిపోవడంతో దొంతికుంట గ్రామంలో విషాదం అలుముకుంది.

News November 24, 2025

NLG: ‘TCC పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలి’

image

టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు ఎగ్జామ్, లోయర్ అండ్ హయ్యర్ డ్రాయింగ్ అండ్ టైలరింగ్ పరీక్షలకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి బొల్లారం భిక్షపతి ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ www.bse.telangana.gov.in ను చూడాలన్నారు. .

News November 24, 2025

మంచిర్యాల: ఓటు వేయడానికి రెడీనా..!

image

మంచిర్యాల జిల్లాలోని గ్రామపంచాయతీలకు సర్పంచ్ రిజర్వేషన్లను ఈ విధంగా కేటాయించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 306 గ్రామపంచాయతీలు, 2,680 వార్డులకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. సర్పంచ్ స్థానాలు ఎస్టీలకు 65, ఎస్సీ 81, బీసీ 23, జనరల్ 137 స్థానాలు కేటాయించారు. డిసెంబర్ రెండో వారంలో మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించడానికి జిల్లా అధికారులు సన్నద్ధమవుతున్నారు.