News January 28, 2025
ప్రజలను ఇబ్బందులకు గురి చేసే వారి పట్ల కఠినంగా ఉండాలి: సీపీ

ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని వరంగల్ సీపీ అంబర్ కిషోర్ ఝా పోలీస్ అధికారులకు సూచించారు. నెలవారీ సమీక్షలో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో మంగళవారం పోలీస్ అధికారులతో సీపీ నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. డీసీపీలు, ఏఎస్పీ, ఏసీపీలు, సీఐలు పాల్గొన్నారు.
Similar News
News February 9, 2025
భద్రాద్రిలో 22 జడ్పీటీసీ, 236 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 22 జడ్పీటీసీ, 236 ఎంపీటీసీ స్థానాలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం కోసం జిల్లా యంత్రాంగం సమాయత్తమవుతోంది. 21 జడ్పీటీసీ స్థానాలు ఉండగా, ఇటీవల భద్రాచలం కొత్తగా ఏర్పడడంతో సంఖ్య 22కు చేరింది. గతంతో పోలిస్తే ఈసారి 16 ఎంపీటీసీ స్థానాలు పెరిగి 236 అయ్యాయి.
News February 9, 2025
మహారాష్ట్రలో పెరుగుతున్న GBS కేసులు

మహారాష్ట్రలో తాజాగా మరో 3 <<15225307>>గిలియన్ బార్ సిండ్రోమ్<<>> కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు సంఖ్య 183కు చేరింది. 6 మరణాలు సంభవించాయి. ఇప్పటివరకు 151 మంది కోలుకున్నారు. ఇటీవల ముంబైలోనూ GBS తొలి కేసు నమోదైంది. 64 ఏళ్ల వృద్ధురాలికి ఈ వ్యాధి ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. అంధేరి తూర్పు ప్రాంతంలో నివసించే ఆ మహిళకు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
News February 9, 2025
నేడు బీఆర్ఎస్ ‘బీసీ’ సమావేశం

TG: స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు కోసం పోరాడాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి భవిష్యత్తు కార్యాచరణపై ఇవాళ బీసీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులతో కేటీఆర్ ‘బీసీ’ సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణ భవన్‌లో జరిగే ఈ భేటీలో కులగణన సర్వే నివేదిక, 42% రిజర్వేషన్ అమలుతో పాటు ఇతర సమస్యలపై ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై పార్టీ నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.