News April 7, 2024
ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు: ఎస్పీ
ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసినా, చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్నా వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ వకుల్ జిందాల్ మీడియాతో మాట్లాడుతూ.. సమస్యాత్మక గ్రామాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగా, కేంద్ర సాయిధ బలగాలతో పికెట్లు ఏర్పాటు చేశామని తెలిపారు.
Similar News
News February 5, 2025
గుంటూరులో వైద్యం వికటించి చిన్నారి మృతి
లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని చౌత్రాడౌన్లో అంజుమ్ అనే చిన్నారి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం వికటించి మరణించిందని బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు. జలుబుతో ఇబ్బంది పడుతుందని చిన్నారిని ఆసుపత్రిలో చూపించడానికి వస్తే ఇలా జరిగిందని తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమౌతున్నారు. లాలాపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News February 5, 2025
నగ్న వీడియోలతో బెదిరింపులు.. గుంటూరు వ్యక్తిపై కేసు
సాఫ్ట్వేర్ యువతులను ట్రాప్ చేసి వీడియో కాల్స్ రికార్డ్ చేసి లైంగిక వాంఛలు తీర్చుకుంటున్న మస్తాన్ సాయి అనే వ్యక్తిని నార్సింగ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మస్తాన్ సాయి గుంటూరు, నల్లచెరువు ప్రాంతానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. బీటెక్ నుంచే అడ్డదారి పట్టాడని, నిందితుడు తండ్రి మస్తాన్ దర్గాకు వారసత్వ ధర్మకర్త కాగా మస్తాన్ వద్ద 80పైగా వీడియో కాల్స్ దృశ్యాలు ఉన్నాయన్నారు.
News February 5, 2025
తెనాలి: రైలు నుంచి జారిపడి వాచ్ మెన్ మృతి
రైలు నుంచి జారి పడి గాయాలపాలైన ప్రయాణికుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. చీరాలకు చెందిన భాస్కర్(48) నిడుబ్రోలులోని రైతుబజార్లో వాచ్ మెన్గా పని చేస్తున్నాడు. సోమవారం ఉదయం రైలులో ప్రయాణిస్తూ తెనాలి స్టేషన్లో రైలు నుంచి జారి పడి తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని పోలీసులు వైద్యశాలకు పంపగా చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతి చెందాడు. తెనాలి జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.