News September 4, 2024
ప్రజలను, రైతులను అప్రమత్తం చేయాలి: డిప్యూటీ సీఎం

పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు ప్రాంత ప్రజలను, రైతులను అప్రమత్తం చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి కార్యాలయం వద్ద ఆయన మాట్లాడారు. జగనన్న కాలనీ ఇప్పటికే ముంపులో ఉన్నందున స్థానికులకు నిత్యావసరాలు అందించాలన్నారు. రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయతీరాజ్ అధికారులతో సమన్వయం చేసుకొని రైతాంగానికి, ప్రజలకి ధైర్యం చెప్పాలని సూచించారు.
Similar News
News November 7, 2025
గోపాలపురం: కొడవలితో భార్యపై భర్త దాడి

భార్యపై అనుమానంతో భర్త కొడవలితో దాడి చేసిన ఘటన గోపాలపురం మండలం దొండపూడి మేదరపేటలో జరిగింది. ఎస్‌ఐ మనోహర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 6 అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో సింధూజపై అనుమానం పెంచుకున్న ఆమె భర్త కాసాని రామకృష్ణ మద్యం మత్తులో వచ్చి దాడి చేశాడు. సింధూజకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
News November 7, 2025
డిజిటల్ సేవలపై అవగాహన కల్పించాలి: కలెక్టర్

తూ.గో. జిల్లా వ్యాప్తంగా ‘మన మిత్ర’ వాట్సాప్ ఆధారిత సేవలపై శుక్రవారం నుంచి డోర్ టు డోర్ అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలియజేశారు. గ్రామ/వార్డు సచివాలయాల సిబ్బంది ఇంటింటికీ వెళ్లి వాట్సాప్ సేవల డెమో, క్యూఆర్ కోడ్ పంపిణీ, పాంప్లెట్లు ఇవ్వాలని ఆమె ఆదేశించారు. ప్రతి ఇంటిని కవర్ చేసి, నమోదు అయిన కుటుంబాల వివరాలను రికార్డు చేయాలని కలెక్టర్ సూచించారు.
News November 7, 2025
‘వందేమాతరం గీతం’ వార్షికోత్సవం నిర్వహించాలి: కలెక్టర్

దేశభక్తి గీతం వందేమాతరం రచించి 150 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈనెల 7న జిల్లా వ్యాప్తంగా వార్షికోత్సవ వేడుకలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి గురువారం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో ఆర్టీ నంబర్ 2025 ప్రకారం, జిల్లా వ్యాప్తంగా అన్ని డివిజన్, మండల, గ్రామ స్థాయిల్లో ఒకే సమయంలో ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని ఆమె అధికారులకు సూచనలు జారీ చేశారు.


