News September 8, 2024
ప్రజలారా తస్మాత్ జాగ్రత్త.. కడప SP

వినాయక చవితి పండుగ నేపథ్యంలో వినాయక మండపాల వద్ద ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కడప జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ప్రజలను కోరారు. ప్రతి వినాయక మండపం వద్ద పోలీసు శాఖ తరపున బందోబస్తు ఏర్పాటు చేశామని, అయితే స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే ప్రజలు వారి విలువైన ఆభరణాలు వస్తువుల పట్ల జాగ్రత్త వహించాలన్నారు. పిక్ పాకెటర్స్, చైన్ స్నాచర్లు, ఇతర వస్తువుల దొంగల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
Similar News
News February 7, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరల వివరాలు

ప్రొద్దుటూరులో శనివారం బంగారం, వెండి ధరల వివరాలు.
* 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర: రూ.16,040
* 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర: రూ.14,757
* 10 గ్రాముల వెండి ధర: రూ.2,670.
News February 7, 2026
పెండింగ్ పనులన్నీ త్వరితగతిన పూర్తి చేయాలి..!

కడప జిల్లాలో పెండింగ్‌లో ఉన్న అన్ని రకాల ఎన్ఆర్ఈజీఎస్ పనులను ఈ ఆర్థిక సవత్సరంలోగా పూర్తి చేయాలని కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి సంబంధిత శాఖల ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా జిల్లాలో జరుగుతున్న వివిధ రకాల అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే పనులు మొదలు పెట్టి పురోగతిలో ఉన్న వాటిని మార్చి 15 లోపు పూర్తి చేయాలన్నారు.
News February 7, 2026
నేడు టీడీపీ కార్యవర్గ ప్రమాణ స్వీకారం

తెలుగుదేశం పార్టీ కడప జిల్లా నూతన కమిటీ ఈరోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నూతన అధ్యక్షుడిగా భూపేష్ సుబ్బరామిరెడ్డిని అధిష్ఠానం నియమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి సవిత ఆధ్వర్యంలో అధ్యక్షుడితో సహా కార్యవర్గ సభ్యులు ప్రమాణం చేయనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించి ఏర్పాట్లను పూర్తి చేశారు. ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది.


