News June 1, 2024

ప్రజలు అపోహలను నమ్మొద్దు: DSP ఉమామహేశ్వర రెడ్డి

image

ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ప్రజలు మీడియా ద్వారా తెలుసుకోవాలని, సోషల్ మీడియాలో వచ్చే అనధికారిక ఫలితాలు, అపోహలను ప్రజలు నమ్మొద్దని శ్రీకాళహస్తి డి.ఎస్.పి ఉమామహేశ్వర రెడ్డి శుక్రవారం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉందని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

Similar News

News December 29, 2024

కుప్పంలో ఫారెస్ట్ అధికారుల ఆకస్మిక తనిఖీలు

image

కుప్పం నియోజకవర్గంలో శనివారం రాత్రి ఫారెస్ట్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి అనుమతులు లేకుండా కలపను అక్రమంగా తరలిస్తున్న పది వాహనాలను ఫారెస్ట్ అధికారులు సీజ్ చేసినట్లు సమాచారం. కుప్పం నియోజకవర్గంలో ఇటీవల కలప అక్రమ రవాణా జోరుగా సాగుతున్న నేపథ్యంలో శనివారం రాత్రి ఫారెస్ట్ అధికారులు నియోజకవర్గ వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.

News December 28, 2024

CA ఫలితాల్లో ‘టాప్‘ లేపిన చిత్తూరు జిల్లా కుర్రాడు

image

జాతీయ స్థాయిలో జరిగిన చార్టెర్డ్ అకౌంటెంట్(CA) తుది ఫలితాల్లో చిత్తూరు జిల్లా వాసి అగ్రస్థానం కౌవసం చేసుకున్నాడు. తాజాగా వెలవడిన ఫలితాల్లో పలమనేరుకు చెందిన రిషబ్ ఓత్సవాల్ 600 మార్కులకు గాను 508 మార్కులు సాధించి మరో విద్యార్థితో సమానంగా నిలిచాడు. దీంతో ఇన్‌స్టి‌ట్యూట్ ఆఫ్ చార్టెర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండిమా(ICIA) ఇద్దరికి ప్రథమ స్థానం కేటాయించింది. వారికి పలువురు అభినందనలు తెలిపారు.

News December 28, 2024

చిత్తూరు: 30 నుంచి దేహదారుడ్య పరీక్షలు

image

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రాథమిక రాత పరీక్షలకు ఉత్తీర్ణులైన వారికి డిసెంబర్ 30 నుంచి జనవరి 10 వరకు దేహదారుడ్య పరీక్షలు నిర్వహించనున్నట్టు ఎస్పీ మణికంఠ తెలిపారు. 990 మంది మహిళలు, 4248 మంది పురుషులు జిల్లా పోలీస్ ట్రైనింగ్ కేంద్రంలో పరీక్షలకు హాజరుకావాలన్నారు. ఈ మేరకు సిబ్బందికి పోలీసు గెస్ట్ హౌస్ సమావేశ మందిరంలో అవగాహన కల్పించారు.