News January 10, 2026

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: భూపాలపల్లి ఎస్పీ

image

సంక్రాంతి పండుగ సెలవుల సందర్భంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలు పెద్ద సంఖ్యలో తమ స్వగ్రామాలకు, బంధువుల ఇళ్లకు ప్రయాణం చేయనున్న నేపథ్యంలో ఖాళీగా ఉండే ఇళ్లలో దొంగతనాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సంక్రాంతి పండుగలను దృష్టిలో ఉంచుకుని జిల్లా వ్యాప్తంగా, పోలీస్ గస్తీని మరింత పటిష్ఠం చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు.

Similar News

News January 23, 2026

పిట్లం: గురువు ఉదారత.. అనాథ బాలుడికి విద్యాదాత!

image

తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారిన ఓ విద్యార్థికి నేనున్నానంటూ భరోసానిచ్చారు తిమ్మానగర్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నారాయణ. పిట్లం (M) తిమ్మానగర్ MPUPSలో బోండ్ల ప్రణయ్ 7వ తరగతి చదువుతున్నాడు. అతడి తండ్రి మూడేళ్ల క్రితం, తల్లి అంబవ్వ ఇటీవల క్యాన్సర్‌తో మరణించారు. అనాథగా మారి, దిక్కుతోచని స్థితిలో ఉన్న ప్రణయ్‌ను ఆయన ఉన్నతాధికారుల వద్దకు తీసుకెళ్లి, గురుకుల పాఠశాలలో సీటు, హాస్టల్ వసతి కల్పించారు.

News January 23, 2026

కడప: Way2News ఎఫెక్ట్ VRO సస్పెండ్

image

చెన్నూరు మండలం రామనపల్లి<<18926711>> VRO<<>> వేణుగోపాల్‌ను సస్పెండ్ చేస్తూ కడప కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామ రెవెన్యూ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న వేణు గోపాల్‌పై అందిన లైంగిక వేధింపుల ఫిర్యాదు మేరకు క్రమశిక్షణ చర్యల్లో భాగంగా VROను సస్పెండ్ చేస్తూ గురువారం కలెక్టర్ ఉత్తర్వులిచ్చారు.

News January 23, 2026

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.