News January 7, 2025

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: గుంటూరు DMHO

image

చైనాను ఒణికిస్తున్న hMPV వైరస్ కేసులు మన దేశంలో నమోదు కావడంతో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని గుంటూరు DMHO డాక్టర్ కొర్రా విజయలక్ష్మి తెలిపారు. ప్రజలు సాధ్యమైనంత వరకు ఇళ్లలోనే ఉండాలని, బయటకు వచ్చేటప్పుడు మాస్క్ ధరించాలన్నారు. పూర్తి స్థాయిలో నియంత్రణ చర్యలు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు.

Similar News

News December 9, 2025

ప్రతి గురువారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్: మంత్రి అనగాని

image

రెవెన్యూ సమస్యలపై ప్రతి గురువారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ మంగళవారం సచివాలయంలో తెలిపారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దడానికి సమయం పడుతోందని, రిజిస్ట్రేషన్ శాఖలో పూర్తిస్థాయి మార్పులతో తప్పులకు ఆస్కారం లేని వ్యవస్థను తీసుకువస్తామన్నారు. రైతులకు త్వరగా పాస్ పుస్తకాలు జారీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు ఆయన పేర్కొన్నారు.

News December 9, 2025

స్క్రబ్ టైఫస్‌పై అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఆరోగ్య అధికారి

image

జిల్లా ఆరోగ్య అధికారి డా. విజయలక్ష్మి స్క్రబ్ టైఫస్‌పై అప్రమత్తంగా ఉండాలని కోరారు. పేడ పురుగు బ్యాక్టీరియా వల్ల వచ్చే ఈ వ్యాధికి జ్వరం, దద్దుర్లు, తలనొప్పి ప్రధాన లక్షణాలుగా ఉంటాయని తెలిపారు. జీజీహెచ్‌లో IGM ELISA పరీక్ష అందుబాటులో ఉంది. పొదలు, పొలాల్లోకి వెళ్లేటప్పుడు పూర్తి దుస్తులు ధరించాలని, లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే దగ్గరలోని ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని ఆమె సూచించారు.

News December 9, 2025

21న పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం: కలెక్టర్

image

ఈ నెల 21న జిల్లా వ్యాప్తంగా పల్స్ పోలియో నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. పల్స్ పోలియో కార్యక్రమం పై జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశం మంగళవారం కలెక్టరేట్‌లో జరిగింది. ప్రచార పోస్టర్లను ఆవిష్కరించి కలెక్టర్ మాట్లాడారు. 5 సం.ల లోపు వయస్సు చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేయించాలన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కె. విజయ లక్ష్మి, ఇతర అధికారులు పాల్గొన్నారు.