News January 7, 2025
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: గుంటూరు DMHO
చైనాను ఒణికిస్తున్న hMPV వైరస్ కేసులు మన దేశంలో నమోదు కావడంతో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని గుంటూరు DMHO డాక్టర్ కొర్రా విజయలక్ష్మి తెలిపారు. ప్రజలు సాధ్యమైనంత వరకు ఇళ్లలోనే ఉండాలని, బయటకు వచ్చేటప్పుడు మాస్క్ ధరించాలన్నారు. పూర్తి స్థాయిలో నియంత్రణ చర్యలు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు.
Similar News
News January 16, 2025
మహిళా పోలీసులు ఒక వారధి: జిల్లా ఎస్పీ
క్షేత్ర స్థాయిలో ప్రజలకు, పోలీస్ శాఖకు మధ్య మహిళా పోలీసులు ఒక వారధి లాంటి వారని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఐపీఎస్ అన్నారు. గురువారం గుంటూరు జిల్లాకు చెందిన గ్రామ/వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శులకు (మహిళా పోలీసులకు) దైనందిన విధులకు సంబంధించి జాబు చార్టు యాప్ ను ఎస్పీ ఆవిష్కరించారు. జాబు చార్టు యాప్‌తో జవాబుదారితనం ఏర్పడి సమర్ధవంతంగా విధులు నిర్వర్తించే అవకాశం ఏర్పడిందన్నారు.
News January 16, 2025
గుంటూరు: పీఎం ఇంటర్న్‌షిప్ పోస్టర్ల ఆవిష్కరణ
యువతలో నైపుణ్యాలను పెంపొందించి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు పీఎం ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌ను ప్రభుత్వం ప్రారంభించిందని గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మి అన్నారు. కలెక్టరేట్లో ఈ పథకం సంబంధించిన వాల్ పోస్టర్లను జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ అధికారి సంజీవరావుతో కలిసి ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ.. 21 నుంచి 24 ఏళ్ల మధ్య ఉన్నవారు అర్హులన్నారు. https://mca.gov.in/login/లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
News January 16, 2025
గుంటూరు: పలు పోస్టులకు నోటిఫికేషన్
గుంటూరు DCCBలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ మేనేజర్, స్టాఫ్ అసిస్టెంట్/క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు ఇందుకు సంబంధించి వివరాలను అధికార సైట్లో ఉంచారు. గుంటూరు DCCBలో 31 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు, 50 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉండగా ఈనెల 22లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఫిబ్రవరిలో ఆన్‌లైన్ టెస్ట్ నిర్వహించే అవకాశముంది.