News January 11, 2026

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: అన్నమయ్య ఎస్పీ

image

సంక్రాంతి నేపథ్యంలో అన్నమయ్య జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పి ధీరజ్ ఒక ప్రకటనలో కోరారు. పండగ ఆఫర్లు, ఉచిత గిఫ్టులు, భారీ డిస్కౌంట్ల పేరుతో వచ్చే లింకులను క్లిక్ చేస్తే భారీగా నష్టపోవడం ఖాయమన్నారు. అపరిచిత వ్యక్తులకు వ్యక్తిగత సమాచారం ఇవ్వరాదని స్పష్టం చేశారు. మోసపోయిన వారు వెంటనే 1930కి సమాచారం ఇవ్వాలన్నారు.

Similar News

News January 15, 2026

టీమ్ ఇండియాకు గట్టి ఎదురుదెబ్బ

image

NZతో జరిగే 5 మ్యాచ్‌ల T20 సిరీస్‌కు ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ దూరమయ్యారు. గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ తెలిపింది. ఇప్పటికే చివరి రెండు వన్డేలకు దూరమైన సుందర్.. ఇప్పుడు టీ20లకు సైతం అందుబాటులో ఉండటం లేదు. జనవరి 21 నుంచి T20 సిరీస్ ప్రారంభం కానుంది. మరోవైపు ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న T20 వరల్డ్‌కప్‌కు ముందు ఇది ఆందోళన కలిగించే అంశంగా మారింది.

News January 15, 2026

‘ఆదోనికి మీరే దిక్కు సీఎం చంద్రబాబూ..’

image

ఆదోని జిల్లా సాధన కోసం చేపట్టిన దీక్ష ఇవాళ 60వ రోజుకు చేరుకున్న సందర్భంగా సంతేకుడ్లూరు గ్రామ యువతతో పాటు జేఏసీ నాయకులు దీక్షలో పాల్గొని ఉద్యమానికి మద్దతు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే తమకు దిక్కు అంటూ కళాకారుడు జగదీశ్ వేసిన చిత్రం అందరినీ ఆకట్టుకుంది. కార్యక్రమంలో జేఏసీ నాయకులు నూర్ అహ్మద్, షకీల్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

News January 15, 2026

రూ.1,499కే ఇండిగో విమాన టికెట్

image

విమానయాన సంస్థ ఇండిగో ప్రయాణికులకు ఆకర్షణీయ ఆఫర్‌ను ప్రకటించింది. ‘Sail into 2026’ పేరుతో దేశీయ రూట్లలో ఒకవైపు విమాన టికెట్ ధరను కేవలం రూ.1,499గా నిర్ణయించింది. అంతర్జాతీయ ప్రయాణాలకు ప్రారంభ ధర రూ.4,499గా వెల్లడించింది. ఈ ఆఫర్ ఈ నెల 16 వరకు అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఈ ఆఫర్ కింద టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు జనవరి 20 నుంచి ఏప్రిల్ 30 మధ్య ఎప్పుడైనా ప్రయాణించవచ్చని స్పష్టం చేసింది.