News March 1, 2025
ప్రజలు ఆందోళన చెందొద్దు: నంద్యాల కలెక్టర్

ఆత్మకూరు పురపాలక సంఘంలోని 5వ వార్డు నీలితొట్టి వీధిలో సరఫరా అయ్యే తాగు నీరు కలుషితం కాలేదని జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. ల్యాబ్ టెస్టుల్లో నీరు కలుషితమైనట్లు నిరూపణ కాలేదని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. స్థానికంగా అతిసార ప్రబలడంతో వైద్య సిబ్బంది 24 గంటలపాటు ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్వో, డీసీహెచ్ఎస్లను కలెక్టర్ ఆదేశించారు.
Similar News
News November 19, 2025
నేడు కాజీపేట నుంచి దర్భాంగా స్పెషల్ ట్రైన్

కాజీపేట మీదుగా దర్భాంగ స్పెషల్ రైలు బుధవారం నడవనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. చర్లపల్లి-దర్భాంగ మధ్య నడిచే ఈ ప్రత్యేక రైలు(07999) కాజీపేట, రామగుండం, మంచిర్యాల, సిర్పూర్, కాగజ్నగర్, బల్లార్ష, గోండియా, రాయపూర్, బిలాస్పూర్, రాంచి సహా పలు స్టేషన్లలో ఆగనుంది. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేకంగా ఈ రైలును నడుపుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
News November 19, 2025
ఉమ్మడి మెదక్ జిల్లాను వణికిస్తున్న చలి

ఉమ్మడి మెదక్ జిల్లాలో రోజురోజుకు చలి తీవ్రత తీవ్రంగా పెరుగుతోంది. రాష్ట్రంలోనే కోహిర్ మండలంలో 7.3 కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. న్యాల్కల్ 8.2, ఝరాసంగం 8.4, సదాశివపేట 8.6, కంగ్టి 9.6, మెదక్ జిల్లా నర్లాపూర్ 9.5, మొగుడంపల్లి 9.3 అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఉదయం సమయంలో ప్రజలు బయటకు రాకుండా ఉండాలని సూచించారు.
News November 19, 2025
ములుగు: జీరంఘాటి ఘటన వెనక మడవి హిడ్మానే

మడవి హిడ్మా నాయకత్వం వహించిన అనేక ఘటనల్లో జీరంఘాటి ఘటన దేశవ్యాప్తంగా సంచలం సృష్టించింది. జగదల్పూర్ సమీపంలోని దర్భాఘాట్ వద్ద 2013 మే 25న కాంగ్రెస్ నాయకులు చేపట్టిన పరివర్తన యాత్రలో భాగంగా 25 వాహనాల్లో వెళ్తున్న కాన్వాయిని మావోయిస్టులు పేల్చి వేశారు. ఈ ఘటనలో మాజీ కేంద్రమంత్రి చరణ్ శుక్లా, రాష్ట్ర మంత్రి మహేంద్ర కర్మ, నంద్ కుమార్ పటేల్, ఉదయ్ ముదలియార్, గోపి మద్వానీ, పూలో దేవి హతమయ్యారు.


