News June 2, 2024
ప్రజలు ఎన్నికల ఫలితాల అనంతరం సంయమనం పాటించాలి: ఎస్పీ

ప్రజలు ఎన్నికల ఫలితాల అనంతరం సంయమనం పాటించాలని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక అన్నారు. శ్రీకాకుళంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా కలెక్టర్‌తో కలిసి జిల్లా ఎస్పీ మాట్లాడారు. జిల్లాలో 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందన్నారు. నలుగురు కంటే ఎక్కువ మంది గుమిగూడి ఉండరాదని హెచ్చరించారు.
Similar News
News February 24, 2026
సారవకోట: జిల్లా గ్రంథాలయ సంస్థలో ఖాళీగా 70 ఉద్యోగాలు

జిల్లా గ్రంథాలయ సంస్థలో 70 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వాటిని భర్తీ చేయాల్సి ఉందని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి శంకరరావు తెలిపారు. సారవకోట మండల కేంద్రంలోని శాఖా గ్రంథాలయాన్ని మంగళవారం ఆయన సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లా గ్రంథాలయ సంస్థకు జిల్లా పట్టణ, గ్రామీణ పంచాయతీల నుంచి రావలసిన 8% గ్రంథాలయ సెస్సులను ప్రభుత్వం విడుదల చేయాలని కోరారు.
News February 24, 2026
శ్రీకాకుళం: జిల్లా స్థాయి సైక్లింగ్ పోటీల నిర్వహణ

శ్రీకాకుళంలోని కోడి రామ్మూర్తి స్టేడియంలో మంగళవారం జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో సైక్లింగ్ పోటీలు నిర్వహించారు. అండర్-18 పురుషులు, మహిళల విభాగంలో ఈ పోటీలు జరిగాయి. జిల్లా క్రీడాభివృద్ధి అధికారి మహేశ్ బాబు పోటీలను పర్యవేక్షించారు. విజేతలు ఈనెల 28న ఎన్టీఆర్ జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు.
News February 24, 2026
శ్రీకాకుళం: ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షకు 312 మంది గైర్హాజరు

శ్రీకాకుళం జిల్లాలోని 71 పరీక్షా కేంద్రాల్లో మంగళవారం జరిగిన ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పరీక్షకు 312 మంది గైర్హాజరైనట్లు జిల్లా ఆర్ఐఓ ఆర్.సురేష్ కుమార్ తెలిపారు. మొత్తం 19,158 మంది పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా 18,840 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు పేర్కొన్నారు. 98.34 హాజరు శాతం నమోదు అయినట్లు ఆయన వెల్లడించారు.


