News July 2, 2024

ప్రజలు ఛీ కొట్టినా జ్ఞానోదయం కలగలేదు: గంటా

image

వైసీపీ ప్రభుత్వ పాలన వద్దని ప్రజలు ఛీకొట్టినా ఆ పార్టీ నేతలకు ఇంకా జ్ఞానోదయం కలగకపోవడం విచారకరమని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై గంటా స్పందించారు. వైసీపీకి చెందిన వారిని వీసీలుగా నియమించుకుని జగన్ రెడ్డి విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారని ఎక్స్ వేదికగా ఎమ్మెల్యే ఆరోపించారు.

Similar News

News November 27, 2024

పార్వతీపురం: మూగజీవాలను హింసించిన కేసులో ఇద్దరి అరెస్ట్

image

మూగజీవాలను హింసించిన కేసులో ఇద్దరిని అరెస్టు చేసినట్లు సబ్ DFO సంజయ్ తెలిపారు. పార్వతీపురం మండలం బండి ధర వలస గ్రామానికి చెందిన ఎస్.నరసింహరావు, ఏ.నానిబాబు ఉడుమును చంపారని తెలిపారు. చంపి వాటిని తింటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారన్నారు. అటువీ శాఖ ఆధ్వర్యంలో మూగజీవాలను హింసించే చట్టం క్రింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

News November 27, 2024

విశాఖ-కోరాపుట్ ప్యాసింజర్ రద్దు

image

కోమటిపల్లి, రాయగడ, విజయనగరం మధ్య నాన్ ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా విశాఖపట్నం-కోరాపుట్(08546) ప్యాసింజర్‌ను అధికారులు రద్దు చేశారు. ఈనెల 29 నుంచి వచ్చే నెల 4వతేదీ వరకు ప్యాసింజర్ రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. కోరాపుట్- విశాఖపట్నం ఈనెల 29 నుంచి డిసెంబర్ 5 వరకు రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

News November 26, 2024

విజయనగరంలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

image

విజయనగరం ఏపీఎస్పీ బెటాలియన్ సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందాడు. పోలీసులు వివరాల ప్రకారం.. భోగాపురం మండలం గూడెపువలసకి చెందిన రమేశ్ (25) విజయనగరం నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా ముందున్న బొలేరోని ఢీకొన్నాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రమేశ్‌ని ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. దీనిపై డెంకాడ ఎస్.ఐ ఏ. సన్యాసినాయుడు కేసు నమోదు చేశారు.