News January 30, 2025
ప్రజలు పోలీసు సేవలు వినియోగించుకోవాలి: నిర్మల్ SP

భైంసా ఏఎస్పీ కార్యాలయంలో బుధవారం జిల్లా ఎస్పీ జానకి షర్మిల వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి అర్జీలను స్వీకరించారు. వాటిని తక్షణమే పరిష్కరించాలని ఆయా పోలీస్ స్టేషన్ ఎస్ఐ, సీఐలకు ఫోన్ ద్వారా మాట్లాడి ఆదేశించారు. ప్రజలు నిర్భయంగా మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా పోలీసు సేవలను వినియోగించుకోవాలని కోరారు.
Similar News
News February 11, 2025
కృష్ణా జిల్లాలోనూ బర్డ్‌ఫ్లూ.. చికెన్, గుడ్లు తినొద్దని అధికారుల ఆదేశాలు

AP: ఉ.గో జిల్లాల్లో కల్లోలం సృష్టిస్తోన్న <<15428552>>బర్డ్ ఫ్లూ<<>> కృష్ణా జిల్లాకూ విస్తరించింది. గంపలగూడెం(M)లో వైరస్ నిర్ధారణ అయ్యింది. 2 రోజుల్లోనే 10వేలకు పైగా కోళ్లు మృతి చెందాయి. వైరస్ సోకిన కోళ్లను నాశనం చేయాలని అధికారులు ఆదేశించారు. ఆ చుట్టుపక్కల 10KM పరిధిలో చికెన్, గుడ్లు తినొద్దని ప్రజలకు సూచించారు. కాగా 100డిగ్రీల ఉష్ణోగ్రతలో మాంసాన్ని ఉడికిస్తే ప్రమాదం లేదని నిపుణులు చెబుతున్నారు.
News February 11, 2025
పాఠశాలలకు కోడిగుడ్లు పంపిణీ నిలుపుదల: కలెక్టర్

బర్డ్ ఫ్లూ తో కోళ్లు మరణిస్తున్న నేపథ్యంలో వారం రోజులు పాఠశాలలకు, అంగన్వాడీలకు కోడిగుడ్లు పంపిణీని నిలిపివేయాలని కలెక్టర్ మహేశ్ కుమార్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎమ్మార్వో, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో చర్చించారు. అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, సాంఘిక వసతి గృహాలు, గురుకుల పాఠశాలల పిల్లలకు కోడిగుడ్లు సరఫరా నిలిపివేయాలన్నారు.
News February 11, 2025
ఆధార్ అప్‌డేట్‌కు ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టండి: కలెక్టర్

ఐదేళ్లకు పైబడిన పాఠశాల విద్యార్థులు, 15 ఏళ్లకు పైబడిన విద్యార్థులు తప్పనిసరిగా ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేషన్ చేయించాల్సి ఉంటుందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. ఇందుకు ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టాలని ఆయన తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి ఆధార్ పర్యవేక్షణ కమిటీ సమావేశం జరిగింది. జిల్లాలో ఆధార్ నమోదు స్థితిగతులపై చర్చించారు.