News September 10, 2024
ప్రజలు LHMS సౌకర్యాన్ని వినియోగించుకోవాలి: ఎస్పీ
విజయనగరం పట్టణం, రూరల్ స్టేషన్లతో పాటు నెల్లిమర్ల, బొబ్బిలి పోలీసు స్టేషన్ పరిధిలోని మున్సిపల్ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు LHMS (లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టం) సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఎస్పీ వకుల్ జిందాల్ మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. తమ అవసరాల నిమిత్తం బయట ప్రాంతాలకు వెళ్లే సమయాల్లో తమ ఇండ్లలో ఎటువంటి దొంగతనాలు జరగకుండా ఉండేందుకు ఇది పనిచేస్తోందని తెలిపారు.
Similar News
News October 9, 2024
మోసపోయిన విజయనగరం యువతి
విజయనగరానికి చెందిన యువతిని ఇద్దరు మోసగించారు. సినిమా అవకాశాలు ఇప్పిస్తామనే మాటలు చెప్పి ఆమె నుంచి రూ.9లక్షలు వసూలు చేశారు. ఈ క్రమంలో వారిని ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు పట్టుకున్నారు. ఆరా తీస్తే, ఈ నిందితులు పలువురికి ఇలాగే మాయమాటలు చెప్పి డబ్బులు వసూలు చేసినట్లు తెలిసింది. యువత ఇలాంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
News October 9, 2024
విజయనగరంలో నేడు డయల్ యువర్ MP కార్యక్రమం
విజయనగరం మున్సిపల్ కార్యాలయంలో బుధవారం సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు డయల్ యువర్ ఎంపీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని కమిషనర్ నల్లనయ్య తెలిపారు. పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడంపై భక్తులు సలహాలు సూచనలు అందించాలని కోరారు. విజయనగరం MP కలిశెట్టి అప్పలనాయుడు: 9440436426, MP క్యాంప్ ఆఫీస్: 8919060911, మున్సిపల్ కమిషనర్, విజయనగరం: 9849906486 నెంబర్లను సంప్రదించాలన్నారు.
News October 9, 2024
విజయనగరం జిల్లా TODAY TOP NEWS
➼పార్వతీపురంలో kg టమాటా రూ.50
➼బొండపల్లి: రూ.లక్ష కరెన్సీతో అమ్మవారికి అలంకరణ
➼ అమ్మవారి ఘటాలతో పోటెత్తిన విజయనగరం
➼సిరిమాను ఉత్సవానికి పటిష్ఠ బందోబస్త్: ఎస్పీ
➼పార్వతీపురం: KGBVలలో ఉద్యోగాలకు నోటిఫికేషన్
➼డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో వీసీలో పార్వతీపురం కలెక్టర్
➼VZM: యథావిధిగా డీఎంయూ, రాయ్‌పూర్ పాసింజర్లు
➼: సచివాలయ ఉద్యోగులను మందలించిన మంత్రి కొండపల్లి