News February 12, 2025

ప్రజల్లో పోలీసుశాఖ ప్రతిష్ఠను పెంచాలి: SP

image

మర్యాదకర ప్రవర్తనతో ప్రజల్లో పోలీసుశాఖ ప్రతిష్ఠను పెంచాలని ఎస్పీ వకుల్ జిందల్ సూచించారు. పోలీసు అధికారులతో మాసాంతర నేర సమీక్షా సమావేశాన్ని తన కార్యాలయంలో మంగళవారం నిర్వహించారు. ప్రజలతో మంచిగా ప్రవర్తించి, పోలీసుశాఖ ప్రతిష్ఠతను పెంచాలన్నారు. స్టేషనుకు వచ్చే బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలని, వారు స్టేషనుకు ఏ కారణంతో వచ్చింది తెలుసుకొని, వారు చెప్పే విషయాలను శ్రద్ధగా వినాలని సూచించారు.

Similar News

News October 13, 2025

ధర్నాలు, ర్యాలీలకు అనుమతి తప్పనిసరి: DSP

image

జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా నవంబర్ 11 వరకు సెక్షన్ 30 పోలీసు చట్టం అమలులో ఉందని ఇన్‌‌ఛార్జ్ డీఎస్పీ ఆర్.గోవిందరావు తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, ర్యాలీలు, సమావేశాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టరాదని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. ప్రజలు శాంతియుతంగా వ్యవహరించి, పోలీసు అనుమతులతోనే కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.

News October 13, 2025

జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్‌గా బాధ్యతల స్వీకరణ

image

విజయనగరంలోని జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ నూతన వైస్ ఛాన్సలర్‌గా వి.వెంకట సుబ్బారావు తన కార్యాలయంలో సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన నెహ్రూ, మహాకవి గురజాడ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. విశ్వవిద్యాలయ సిబ్బంది వెంకట సుబ్బారావుకు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు.

News October 13, 2025

పెద్ద తాడివాడలో క్షుద్ర పూజల కలకలం

image

డెంకాడ మండలం పెద్ద తాడివాడ గ్రామంలో క్షుద్ర పూజలు జరిగాయని స్థానికులు తెలిపారు. గ్రామానికి చెందిన పైడియ్య ఇంటి గుమ్మం దగ్గర గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం మనిషి పుర్రెను పెట్టి పూజలు జరగడంతో గ్రామస్థులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రస్తుత కాలంలో కూడా మూఢనమ్మకాలతో కొన్ని గ్రామాల్లో ఇలాంటి పూజలు జరగడం చర్చ నీయాసంగా మారింది. ఎవరు ఈ క్షుద్ర పూజలు చేశారు అనే విషయంపై డెంకాడ పోలీసులు ఆరాతీస్తున్నారు.