News October 21, 2024

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వ పాలన: మహేశ్ కుమార్

image

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పాలన సాగిస్తోందని TPCC అధ్యక్షుడు, MLC మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. సోమవారం నిజామాబాద్ రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో పయనింపజేయడానికి పార్టీలకు అతీతంగా పని చేద్దామని పిలుపునిచ్చారు.

Similar News

News November 6, 2025

NZB: రాష్ట్ర స్థాయి మల్కంబ్లో జిల్లాకు 3వ స్థానం

image

స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర స్థాయి మల్కంబ్ పోటీలలో నిజామాబాద్ జిల్లా అండర్- 17 బాలికల ఛాంపియన్షిప్లో 3వ స్థానం దక్కించుకుంది. నల్గొండ జిల్లాలోని చౌటుప్పల్లో జరిగిన ఈ పోటీలలో మన జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన ఆరుగురు బాలికలు ఆయా కేటగిరీలలో మెడల్స్ సాధించారు. దీంతో ఛాంపియన్షిప్లో 3వ స్థానం దక్కింది. జిల్లా బృందానికి PD సంతోషి కోచ్‌గా వ్యవహరించారు.

News November 6, 2025

10న ఉమ్మడి జిల్లా స్థాయి వాలీబాల్ ఎంపిక ఎంపిక పోటీలు

image

జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 10న ఉమ్మడి జిల్లా స్థాయి సీనియర్ మహిళల, పురుషుల వాలీబాల్ టోర్నమెంట్ కం సెలక్షన్స్ బాన్సువాడలోని మినీ స్టేడియంలో నిర్వహించనున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు N.V. హన్మంత్ రెడ్డి తెలిపారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు పంపుతామన్నారు. ఈ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు ఫిజికల్ డైరెక్టర్ సురేందర్‌ను సంప్రదించాలన్నారు.

News November 5, 2025

నిజామాబాద్: సుదర్శన్ రెడ్డి బాధ్యతల స్వీకరణలో తాహెర్ బిన్ హందాన్

image

తెలంగాణ ప్రభుత్వ ముఖ్య సలదారుడిగా నియమితులైన బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్ధూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్ పాల్గొన్నారు. సుదర్శన్ రెడ్డికి శాలువాతో సన్మానించారు. మరింత ఉన్నత స్థాయిలోకి ఎదగాలని ఆకాంక్షించారు. జిల్లా అభివృద్ధికి, రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని కోరారు.