News November 2, 2024
ప్రజల ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలి: మంత్రి భరత్
ప్రజారోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని మంత్రి టీజీ భరత్ వైద్యారోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. స్టేట్ గెస్ట్ హౌస్‌లో ఆయన అధికారులతో సమీక్షించారు. జిల్లాలోని ఆస్పత్రుల నిర్వహణ, ప్రజలకు అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. ప్రజలు డెంగ్యూ, మలేరియా, ఇతర రోగాల బారిన పడకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ద పెట్టాలన్నారు.
Similar News
News December 9, 2024
రాయలసీమలో మళ్లీ వర్షాలు
ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రాయలసీమలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో డిసెంబర్ 15 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది. వర్షాల నేపథ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
News December 8, 2024
వెల్దుర్తిలో స్నేహితుల ఆర్థిక సాయం అందజేత
వెల్దుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1988 – 89 సంవత్సరంలో పదవ తరగతి విద్యను అభ్యసించిన మిత్రులందరికీ కొన్ని రోజుల క్రితం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఆ కార్యక్రమంలో తోటి మిత్రురాలు తంబల రాజేశ్వరికి రెండు కిడ్నీలు చెడిపోయి అనారోగ్యంతో ఉన్న విషయాన్ని తోటి స్నేహితులు తెలుసుకున్నారు. ఈ మేరకు వారు రూ.20 వేల నగదును సేకరించి ఆదివారం ఆమెకు అందించారు. అనంతరం ఆమె త్వరగా కోలుకోవాలని వారు ప్రార్థించారు.
News December 8, 2024
బేతంచర్లలో ఇరు వర్గాల హిజ్రాల మధ్య ఘర్షణ
బేతంచెర్లలోని కొత్త బస్టాండు సమీపంలో ఆదివారం హిజ్రా వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. నంద్యాలకు చెందిన హిజ్రాల వర్గం బేతంచర్లకు వచ్చి డబ్బువసూలు చేయకూడదని స్థానికులు వాగ్వాదానికి దిగారు. స్థానికుల సమాచారంతో బేతంచర్ల ఎస్సై రమేశ్ బాబు ఘటనా స్థలానికి చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు. దీంతో ఘర్షణ సద్దుమణిగింది.