News December 30, 2024
ప్రజల ఇళ్లపైకి బుల్డోజర్లను తీసుకెళ్తే ఊరుకోం: MLC కవిత

ప్రజల ఇళ్లపైకి బుల్డోజర్లను తీసుకెళ్తే ఊరుకోబోమని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో హైడ్రా పెట్టినట్టు నిజామాబాద్‌లో నిడ్రా పెడుతామని పీసీసీ అధ్యక్షుడు చెప్పడం దారుణమన్నారు. బుల్డోజర్‌తో ప్రజల ఆస్తులు కూలగొడుతామని హెచ్చరిస్తున్నారని, దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని ఆమె పేర్కొన్నారు.
Similar News
News December 7, 2025
NZB: రెండో విడత ఎన్నికల పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్

గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా ఆదివారం కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి, అబ్జర్వర్ శ్యాం ప్రసాద్ లాల్ సమక్షంలో రెండో విడత ఎన్నికల పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ నిర్వహించారు. 1,476 పోలింగ్ కేంద్రాల పరిధిలో ఎన్నికలు జరుగనుండగా 20 శాతం అధనంగా సిబ్బందిని రిజర్వ్‌లో ఉంచుతూ ర్యాండమైజేషన్ చేపట్టారు.

NZB: 2వ విడతలో 38 గ్రామాల సర్పంచ్‌లు ఏకగ్రీవం

2వ విడత స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి 38 గ్రామాల సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని అధికారులు తెలిపారు. ధర్పల్లి మండలంలో 6, డిచ్పల్లి మండలంలో 7, ఇందల్ వాయి, NZB రూరల్ మండలాల్లో 4 చొప్పున, మాక్లూర్ మండలంలో 7, మోపాల్ మండలంలో 1, సిరికొండ మండలంలో 6, జక్రాన్ పల్లి మండలంలో 3 గ్రామ పంచాయతీ సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారన్నారు. మిగిలిన 158 సర్పంచ్ పదవుల కోసం 587 మంది బరిలో నిలిచారన్నారు.