News November 13, 2024
ప్రజల నుంచి ఆర్జీలను స్వీకరించిన మంత్రి పొంగులేటి

HYDలోని రాజ్ భవన్లో బుధవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రజల నుంచి మంత్రి సమస్యలతో కూడిన ఆర్జీలను స్వీకరించారు. అనంతరం వారి సమస్యలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
Similar News
News February 23, 2026
ఖమ్మం: ‘వేసవిలో నిరంతర విద్యుత్ సరఫరాకు సిద్ధం’

రాబోయే వేసవిలో విద్యుత్ డిమాండ్ పెరిగినా అంతరాయం లేకుండా సరఫరా చేస్తామని ఎస్‌ఈ శ్రీనివాసాచారి తెలిపారు. ఇప్పటికే గరిష్ఠ డిమాండ్ 5,904మెగావాట్లకు చేరిందని పేర్కొన్నారు. అదనంగా 110కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు, మంచుకొండ వద్ద కొత్త సబ్‌స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఓవర్ లోడ్ సమస్య లేకుండా సామర్థ్యాన్ని పెంచామని వివరించారు. నాణ్యమైన విద్యుత్ అందించేందుకు సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
News February 23, 2026
ఖమ్మం జిల్లాలో అడుగంటుతున్న భూగర్భ జలాలు!

ఖమ్మం జిల్లాలో వేసవి రాకముందే భూగర్భ జలాలు వేగంగా పడిపోతున్నాయి. కేవలం నెల రోజుల్లోనే 2 అడుగుల మేర నీటిమట్టం తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ఎర్రుపాలెం, మధిర, కామేపల్లి మండలాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. విచ్చలవిడి వాడకం, నీటి పొదుపు లేకపోవడమే ఇందుకు కారణమని అధికారులు చెబుతున్నారు. మే నాటికి జల సంక్షోభం మరింత పెరిగే ప్రమాదం ఉందని, ప్రజలు నీటిని పొదుపుగా వాడాలని భూగర్భజల శాఖ హెచ్చరిస్తోంది.
News February 23, 2026
ఖమ్మంలో తగ్గిన గాలి నాణ్యత.. 156కు చేరిన AQI

ఖమ్మం జిల్లా కేంద్రంలో వాయు కాలుష్యం కోరలు చాస్తోంది. ఆదివారం (FEB 22) నగరంలో వాయు నాణ్యత సూచీ (AQI) ఒక్కసారిగా 156కు చేరింది. గాలిలో PM2.5, PM10 వంటి సూక్ష్మ ధూళి కణాలు ప్రమాదకర స్థాయికి చేరడమే ఇందుకు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. గాలి నాణ్యత ‘అనారోగ్యకర’ స్థాయికి చేరడంతో చిన్నారులు, వృద్ధులు శ్వాసకోశ ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. 100 లోపు AQI ఉంటే నాణ్యమైన గాలిగా తేల్చారు.


