News April 10, 2025
ప్రజల భద్రతే పోలీసుల లక్ష్యం: ఎస్పీ నారాయణరెడ్డి

ప్రజల భద్రతే పోలీసుల లక్ష్యమని ఎస్పీ నారాయణరెడ్డి పేర్కొన్నారు. బుధవారం వికారాబాద్ పట్టణంలోని రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, మార్కెట్ తదితర ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేశారు. తనిఖీల ద్వారా నేరాలను అడ్డుకట్ట వేయవచ్చని తెలిపారు. గంజాయి, డ్రగ్స్, మత్తు పదార్థాలు రవాణా కాకుండా ఉండేందుకు తనిఖీలు చేశామని చెప్పారు.
Similar News
News October 22, 2025
NZB: రియాజ్ మృతి.. డీజీపీకి SHRC ఆదేశాలు

రియాజ్ మృతిపై తెలంగాణ మానవ హక్కుల కమినషన్(SHRC) స్పందించింది. మీడియా కథనాల ఆధారంగా సుమోటోగా కేసు నమోదు చేసింది. నవంబర్ 24వ తేదీలోగా ఇందుకు సంబంధించిన పూర్తి నివేదికను అందజేయాలని డీజీపీ శివధర్ రెడ్డికి ఆదేశాలు జారీ చేసింది. కాల్పులకు దారి తీసిన పరిస్థితులు, కేసు ఎఫ్ఐఆర్, పోస్టుమార్టం రిపోర్టు అందజేయాలంది. కానిస్టేబుల్ నుంచి గన్ లాక్కునేందుకు ప్రయత్నించగా కాల్పులు జరిపినట్లు డీజీపీ ప్రకటించారు.
News October 22, 2025
ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత.. సీఎం సంతకం

TG: స్థానిక ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధనపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రూల్‌ను తొలగించే పంచాయతీరాజ్ చట్ట సవరణ ఫైల్‌పై సీఎం రేవంత్ రెడ్డి సంతకం చేశారు. గురువారం మంత్రివర్గ ఆమోదం తర్వాత ఈ ఫైల్ గవర్నర్ వద్దకు వెళ్లనుంది. ఆయన సంతకం తర్వాత ఆర్డినెన్స్ జారీ చేస్తారు. దాని ప్రకారం వార్డు మెంబర్, సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఎంత మంది పిల్లలు ఉన్నా పోటీ చేయవచ్చు.
News October 22, 2025
మీ విషెస్‌కు థాంక్స్ ట్రంప్: మోదీ

దీపావళి సందర్భంగా విష్ చేసిన US అధ్యక్షుడు ట్రంప్‌కు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. ‘మీ ఫోన్ కాల్‌కు థాంక్స్. ఈ పండుగ నాడు మన రెండు ప్రజాస్వామ్య దేశాలు ప్రపంచాన్ని ప్రకాశింపజేయడాన్ని కొనసాగించాలి. టెర్రరిజానికి వ్యతిరేకంగా ఐక్యంగా నిలబడాలి’ అని పేర్కొన్నారు. కాగా 2 దేశాల మధ్య వాణిజ్యం గురించి <<18068579>>మోదీతో మాట్లాడినట్లు<<>> ట్రంప్ తెలిపారు. వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు.