News March 11, 2025
ప్రజల భద్రత, రక్షణకు ప్రాధాన్యత: SP

కామారెడ్డి జిల్లా ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని ఎస్పీ రాజేశ్ చంద్ర అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణంపై ఫోకస్ పెడతామన్నారు. పారదర్శక సేవల కోసం పోలీస్ శాఖలో ఆన్‌లైన్ విధానానికి ప్రాధాన్యత ఇస్తామన్నారు. నిన్న బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన పట్టణ పోలీస్ స్టేషన్ సందర్శించారు. నేరాలు జరుగుతున్న తీరు, ఫిర్యాదుదారులతో ప్రవర్తించే విధానాన్ని పరిశీలించారు.
Similar News
News March 15, 2026
ఈ జిల్లాల్లో వర్షాలు!

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈ మధ్యాహ్నం నుంచి రేపు 8.30am వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడటానికి ఛాన్స్ ఉందని వెల్లడించింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. ఇక రానున్న 5 రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో 2-4డిగ్రీలు తగ్గుతాయంది.
News March 15, 2026
విద్యార్థులు ధైర్యంగా పరీక్షలు రాయాలి: ఎస్పీ

పార్వతీపురం మన్యం జిల్లాలో పదో తరగతి పరీక్షల నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న 222 పరీక్షా కేంద్రాల వద్ద ప్రత్యేక బందోబస్తు, సెక్షన్ 144 అమలు చేసినట్లు ఎస్పీ ఎస్.వి. మాధవ్ రెడ్డి తెలిపారు. విద్యార్థులు ధైర్యంగా పరీక్షలు రాయాలని ఆయన సూచించారు.
News March 15, 2026
శ్రీ సత్యసాయి జిల్లాలో ఇద్దరి సూసైడ్

శ్రీ సత్యసాయి(D) తాడిమర్రి మండలంలో వేర్వేరు చోట్ల శనివారం ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. నిడిగల్లు గ్రామానికి చెందిన దీపిక(21) కొన్నేళ్లుగా మూర్ఛ వ్యాధితో బాధపడుతోంది. తీవ్ర మనస్తాపంతో ఇంట్లో ఉరేసుకుంది. పుల్లంపల్లి గ్రామానికి చెందిన వెంకటేశ్(47) అప్పుల బాధ తాళలేక మనస్తాపం చెంది పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసినట్లు చెప్పారు.


