News June 24, 2024

ప్రజల మనసును గెలుచుకున్న కలెక్టర్

image

కేవ‌లం 14 నెల‌ల కాలంలోనే ప్ర‌జ‌ల మ‌న‌సుల్లో సుస్థిర స్థానం సంపాదించారు కలెక్ట‌ర్ నాగ‌ల‌క్ష్మి. ఈ కొద్ది రోజుల్లోనే ఆమె అజాత శ‌తృవుగా, అంద‌రికీ అభిమాన‌పాత్రుల‌య్యారు. జిల్లా అభివృద్ధి ప‌ట్ల త‌ప‌న, నిరంత‌ర శ్ర‌మ, ఎటువంటి భేష‌జాలులేని ప‌నితీరుతో ఆమె అంద‌రినీ ఆక‌ట్టుకున్నారు. ఒక‌వైపు ప్ర‌జాప్ర‌తినిధుల‌ను అధికారయంత్రాంగాన్ని స‌మ‌న్వ‌యం చేసుకుంటూ, విధులు నిర్వహించారని అధికారులు గుర్తు చేసుకున్నారు.

Similar News

News November 7, 2024

VZM: వందేభారత్ Vs జన్ సాధారణ్.. మీ ఓటు దేనికి?

image

విజయవాడ-విశాఖ మధ్య ప్రారంభించిన ‘జన్ సాధారణ్'(అన్నీ జనరల్) రైళ్లకు విశేష ఆదరణ లభిస్తుండగా..విజయనగరం మీదుగా వెళ్తున్న వందేభారత్‌‌కు ఆదరణ అంతంతమాత్రంగానే ఉంది. BBL, PVP, VZM, గజపతినగరం, చీపురుపల్లి నుంచి వలస కార్మికులు ఎక్కువగా రాకపోకలు సాగిస్తారు. సరిపడా రైళ్లు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని వందేభారత్‌కు బదులు జన్ సాధారణ్ రైళ్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరి మీరు దేనికి ఓటేస్తారు?

News November 7, 2024

విజయనగరం: మరో మూడేళ్లు ఆయనే..!

image

విజయనగరం జిల్లా స్థానిక సంస్థల MLCగా ఇందుకూరి రఘురాజు కొనసాగవచ్చని హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన 2027 నవంబర్(మరో మూడేళ్లు) ఆ పదవిలో ఉండనున్నారు. 2021లో ఎన్నిక జరగగా.. స్థానిక సంస్థల్లో సరైన సంఖ్యాబలం లేకపోవడంతో టీడీపీ పోటీకి దూరంగా ఉంది. దీంతో ఇందుకూరి వైసీపీ తరఫున ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో ఇందుకూరి భార్యతో పాటు ఆయన అనుచరులు టీడీపీలో చేరారు.

News November 6, 2024

విజయనగరం: వైద్య సేవా సిబ్బందితో సమీక్షా సమావేశం

image

విజయనగరం జిల్లా వైద్య సేవా సిబ్బందితో జిల్లా సమన్వయకర్త అప్పారావు బుధవారం నెలవారి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య సేవా సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడారు. సమయపాలన పాటిస్తూ విధులు నిర్వహించాలని సూచించారు. రోగులతో స్నేహపూర్వకంగా మెలుగుతూ వైద్య సేవలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మేనేజర్, టీమ్ లీడర్లు, వైద్య సేవా సిబ్బంది పాల్గొన్నారు.