News February 27, 2026

ప్రజల ముంగిటకే పాలన: బాపట్ల కలెక్టర్

image

అధికారులు విధులకు పరిమితం కాకుండా నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలని బాపట్ల కలెక్టర్ వినోద్ కుమార్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో దివ్యాంగులు, ఎస్టీల ప్రత్యేక పీజీఆర్ఎస్ నిర్వహించి ఆయన పాల్గొన్నారు. బాపట్ల సేవా సేతుతో ప్రజల వద్దకే పాలన తెస్తున్నామన్నారు. తాగునీటి ఎద్దడిపై యాక్షన్ ప్లాన్, వృద్ధుల హక్కుల కరపత్రాలు విడుదల చేశారు. బాధితుల వినతులు స్వీకరించి అక్కడికక్కడే పరిష్కరించారు.

Similar News

News April 20, 2026

పల్నాడు: అసభ్య ప్రవర్తన.. నిందితుడికి దేహశుద్ధి

image

నాదెండ్ల (M) గణపవరంలోని స్పిన్నింగ్ మిల్లులో పనిచేసే ఒడిశాకి చెందిన ప్రసాద్‌దాస్ పంతులు అనే కార్మికుడు ఓ బాలికపై అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో తోటి కార్మికులు నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేసి వాతలు పెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు గాయపడిన నిందితుడిని చిలకలూరిపేట ఆసుపత్రికి తరలించి, పోక్సో కేసు నమోదు చేశారు.

News April 20, 2026

నేడు రెండో విడత ‘రైతు భరోసా’ విడుదల

image

TG: రైతుభరోసా డబ్బుల కోసం ఎదురుచూస్తోన్న కర్షకులకు శుభవార్త. నేడు సీఎం రేవంత్ రెడ్డి రెండో విడత నిధులను విడుదల చేయనున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం భారీ బహిరంగ సభలో బటన్ నొక్కి ఫండ్స్ రిలీజ్ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 45 లక్షల మందికి పైగా రైతులకు రూ.5,653 కోట్ల మేర లబ్ధి చేకూరనుంది. గత నెల 23న తొలి విడత నిధులు ఇవ్వగా ఇప్పుడు రెండో ఎకరం వరకు నిధులు జమ కానున్నాయి.

News April 20, 2026

MNCL: చుక్క నీటి కోసం.. వందల గొంతుల పోరు!

image

భానుడి భగభగలకు భూగర్భం ఎండిపోయింది. దండేపల్లి మండలం గూడెం గ్రామంలో జలకళ మాయమై.. జలకలత మొదలైంది. ఊరిలోని బావులన్నీ అడుగంటి, ‘ఈడిగేవాడ’లోని ఒక్కగానొక్క బావి ఇప్పుడు ఊరంతటికీ ప్రాణాధారమైంది. ​అగాధంలో ఉన్న కాస్తో కూస్తో జలాన్ని తోడేందుకు ఆ బావిలోకి వందలాది మోటారు పైపులు పాముల్లా వేలాడుతున్నాయి. నీటి చుక్క కోసం మోటార్లు పోటీపడుతుంటే.. బావి గర్భం హాహాకారాలు చేస్తోంది.