News February 4, 2025

ప్రజల సమస్యలను పరిష్కరించాలి: కలెక్టర్

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చే ప్రజల సమస్యలను బాధ్యతగా పరిష్కరించాలని కలెక్టర్ శ్రీధర్ చామకూరి అధికారులను ఆదేశించారు. రాయచోటి కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రసెల్ సిస్టం- పిజిఆర్ఎస్) కార్యక్రమం నిర్వహించారు. ఇందులో వచ్చిన సమస్యలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి, బాధ్యతగా పరిష్కరించాలన్నారు.

Similar News

News January 7, 2026

మిల్లర్లు సహకరించాలి: నెల్లూరు జేసీ

image

రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించేలా మిల్లర్లు సహకరించాలని నెల్లూరు జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు కోరారు. జిల్లాలోని మిల్లర్స్ అసోసియేషన్, మిల్లర్స్‌తో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. లేట్ ఖరీఫ్, ఎర్లీ రబీకి సంబంధించి ధాన్యం సేకరణ, బ్యాంకు గ్యారంటీలపై చర్చించారు. రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరారు.

News January 7, 2026

డబ్బు ముందు ‘బంధం’ ఓడిపోయింది!

image

పోయే ఊపిరి నిలవాలంటే డబ్బే కావాలి అన్నాడు ఓ కవి. కానీ ఆ డబ్బుల కోసం కొందరు సొంత బంధాలను తెంచుకుంటున్నారు. నిజామాబాద్‌లో ప్రియుడితో కలిసి భర్తను భార్య హత్య చేసిన ఘటనలో సంచలన విషయం వెలుగుచూసింది. రూ.2 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బుల కోసం పక్కా ప్లాన్‌తో భర్తను హతమార్చినట్లు విచారణలో తేలింది. అంతకుముందు KNRలోనూ ఇన్సూరెన్స్ డబ్బులు కోసం అన్నను తమ్ముడు హతమార్చిన ఘటన మనుషుల మధ్య సంబంధాలను కాలరాస్తున్నాయి.

News January 7, 2026

ఎన్టీఆర్: విద్యార్థులకు అలెర్ట్.. పరీక్షల షెడ్యూల్ విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్శిటీ(ANU) పరిధిలోని కాలేజీలలో బీఈడీ చదివే విద్యార్థులు రాయాల్సిన 1వ సెమిస్టర్ రెగ్యులర్ & సప్లిమెంటరీ థియరీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షలు 2026 ఫిబ్రవరి 5 నుంచి నిర్వహిస్తామని, ఈ పరీక్షలు రాసే విద్యార్థులు ఎలాంటి ఫైన్ లేకుండా ఈనెల 27లోపు, రూ.100 ఫైన్‌తో 28లోపు ఫీజు చెల్లించాలని ANU సూచించింది. వివరాలకు https://www.nagarjunauniversity.ac.in/ చూడాలని కోరింది.