News March 18, 2025

ప్రజల సమస్యలను పరిష్కరించాలి: అన్నమయ్య కలెక్టర్

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చే ప్రజల సమస్యలను శ్రద్ధతో బాధ్యతగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి అధికారులను ఆదేశించారు. రాయచోటి కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. మొత్తంగా 300 అర్జీలను జిల్లా కలెక్టర్ స్వీకరించారు. అధికారులందరూ ప్రాధాన్యతగా ఫిర్యాదులను నూరు శాతం పరిష్కరించాలన్నారు.

Similar News

News November 23, 2025

భూపాలపల్లి: రూ.50 కోట్ల ధాన్యం రికవరీలో నిర్లక్ష్యం!

image

జిల్లా సివిల్ సప్లై శాఖలో రూ. 50 కోట్ల విలువైన ధాన్యాన్ని నేటికీ రికవరీ చేయడంలో నిర్లక్ష్యం జరుగుతోందని విమర్శలు వస్తున్నాయి. 2022-23 రబీ సీజన్‌లో జిల్లాలోని వివిధ రైస్ మిల్లర్ యజమానులు టెండర్ ద్వారా తీసుకున్న ఈ ధాన్యాన్ని, రెండేళ్లు పూర్తయినా ఇప్పటికీ సీఎంఆర్ ద్వారా ప్రభుత్వానికి బియ్యంగా అందించలేదు. ధాన్యం తీసుకున్నది వాస్తవమేనని సివిల్ సప్లై అధికారులు ధ్రువీకరించారు.

News November 23, 2025

రేపు ఖమ్మం జిల్లాలో మంత్రి తుమ్మల పర్యటన

image

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రేపు (సోమవారం) ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు కల్లూరు మండలం దారుక బంజారాలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణలో మంత్రి పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు ఖమ్మం నగరంలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని క్యాంపు కార్యాలయ ఇన్‌ఛార్జ్ తెలిపారు. అధికారులు సకాలంలో హాజరు కావాలన్నారు.

News November 23, 2025

డీసీసీ దక్కకపోవడంపై మోహన్ రెడ్డి అసంతృప్తి

image

నల్లగొండ జిల్లా డీసీసీ దక్కకపోవడంపై గుమ్మల మోహన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా అధ్యక్ష పదవి దక్కుతుందని ఆశించానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో తిడితేనే పదవులు వస్తాయన్నారు. నిబద్ధతతో జెండా మోసిన నాయకులకు పదవులు రావని వాపోయారు. పార్టీ ఏ కార్యక్రమాలకు పిలుపు నిచ్చిన నిబద్ధతతో పని చేశానన్నారు.