News June 5, 2024
ప్రజాతీర్పును శిరసా వహిస్తాం: తానేటి వనిత

2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తానని గోపాలపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ అభ్యర్థి తానేటి వనిత మంగళవారం రాత్రి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఎన్నికల్లో తనకు ఓట్లేసిన ఓటర్లందరికీ పేరుపేరున కృతజ్ణతలు అని తెలిపారు. పార్టీ కోసం కష్టపడ్డ నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ఇకపై ప్రజల పక్షాన పోరాటాలు చేస్తామని అన్నారు.
Similar News
News December 7, 2025
HIV బాధితుల పట్ల వివక్ష చూపొద్దు: మంత్రి నిమ్మల

2030 నాటికి HIV రహిత రాష్ట్రంగా మార్చేందుకు కృషి చేస్తునట్లు మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. పాలకొల్లులో ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో HIV బాధితులకు చేయూత కార్యక్రమంలో ఆదివారం మంత్రి పాల్గొన్నారు. HIV బాధితులకు పౌష్టికాహారం, నిత్యవసర సరుకుల బ్యాగులను మంత్రి పంపిణీ చేసారు. సమాజంలో HIV బాధితుల పట్ల మానవత్వం, ప్రేమానురాగాలతో మెలగాలని, వారి పట్ల వివక్ష చూపవద్దని కోరారు.
News December 7, 2025
భీమవరం ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్

భీమవరం ఏరియా ఆసుపత్రిలో సుమారు రూ.2 కోట్ల CSR నిధులతో నిర్మించే డయాలసిస్ సెంటర్‌కు ఆదివారం కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ, ఎమ్మెల్యే రామాంజనేయులు, కలెక్టర్ నాగరాణి భూమిపూజ చేశారు. 8 యంత్రాలు, 10 బెడ్లతో ఈ సెంటర్ నిర్మాణం జరుగుతుందన్నారు. ఇది అందుబాటులోకి వస్తే రోగులకు మెరుగైన వైద్య సేవలు లభించి, దూర ప్రాంతాలకు వెళ్లే కష్టం తప్పుతుందని వారు పేర్కొన్నారు.
News December 7, 2025
భీమవరం: రేపు యథావిధిగా PGRS- కలెక్టర్

భీమవరం కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక(PGRS) యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. జిల్లా, మండల స్థాయి అధికారులు అందుబాటులో ఉండి ప్రజలనుంచి అర్జీలు స్వీకరిస్తారని పేర్కొన్నారు. కార్యాలయానికి రాలేనివారు 1100 కాల్ సెంటర్ ద్వారా లేదా meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో తమ సమస్యలను నమోదు చేసుకోవచ్చని సూచించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


