News October 30, 2024

ప్రజాభవన్‌లో ప్రజావాణికి 588 దరఖాస్తులు

image

ప్రజాభవన్‌లో మంగళవారం నిర్వహించిన ప్రజావాణిలో మొత్తం 588 దరఖాస్తులు అందాయి. మైనారిటీ వెల్ఫేర్ శాఖకు సంబంధించి 221, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు 98, విద్యుత్ శాఖకు 84, రెవెన్యూ పరమైన సమస్యలపై 55, ప్రవాసీ ప్రజావాణి ద్వారా 4, ఇతర శాఖలకు 126 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మన్ డా.చిన్నారెడ్డి, ప్రజాపాలన ప్రత్యేకఅధికారి దివ్య పాల్గొన్నారు.

Similar News

News February 28, 2026

HYD: ఇలా అడ్డంగా దొరికిపోయారు!

image

చెరువు ప్రక్షాళన పనులకు సంబంధించిన ₹1.40 కోట్ల బిల్లు పాస్ చేయాలంటే కూకట్‌పల్లి SE చల్లా చిన్నారెడ్డి ఏకంగా ₹15 లక్షలు డిమాండ్ చేసి దొరికిపోయాడు. దుండిగల్‌లో ​బిల్డింగ్ పర్మిషన్ కోసం లక్షల్లో లంచం ఆశించిన అధికారి బుక్కయ్యాడు. ఎవరినైనా ​వదిలే ప్రసక్తే లేదని బండ్లగూడ ఘటన నిరూపించింది. ప్రైవేట్ స్కూల్ ఎగ్జామ్ సెంటర్ పర్మిషన్ ఫైల్‌ను ముందుకు కదపాలంటే <<19262574>>₹10K<<>> అడిగిన జూ.అసిస్టెంట్ శివప్రసాద్‌‌ను వదలలేదు.

News February 28, 2026

అవినీతి అనకొండల గుండెల్లో ACB ‘దడ’

image

సిటీలో లంచగొండి బాబుల ఆటలు ఇక సాగవు. 2025లో తెలంగాణ ACB ఏకంగా 199 కేసులు నమోదు చేసి రికార్డు సృష్టించింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 29.2% పెరుగుదల. ముఖ్యంగా GHMC పరిధిలో 2025 చివరి మూడు నెలల్లోనే గత 14 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా 78 కేసులు నమోదయ్యాయి. మొత్తం 273 మందిని అరెస్ట్ చేయగా, అందులో 176 మంది ప్రభుత్వ ఉద్యోగులే. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో ₹96.13 కోట్ల అక్రమ సంపాదనను ఏసీబీ బయటపెట్టింది.

News February 28, 2026

తొమ్మిదే నెలల్లో ‘ఫ్యూచర్ సిటీ’ నైటౌట్

image

హైదరాబాద్ రేంజ్ మారిపోతోంది బాబోయ్! 765 చదరపు కిలోమీటర్ల భారీ విస్తీర్ణంలో రూపుదిద్దుకుంటున్న ‘ఫ్యూచర్ సిటీ’కి సర్కార్ డెడ్ లైన్ ఫిక్స్ చేసింది. కేవలం 9 నెలల్లోనే పూర్తిస్థాయి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని టెండర్లో స్పష్టం చేసింది. 56 గ్రామాలను కలుపుతూ గ్లోబల్ కంపెనీలు, యూనివర్సిటీలే లక్ష్యంగా ఈ నగరం నిర్మిస్తున్నారు. కాలుష్యం లేని నెట్-జీరో పద్ధతిలో అద్భుత నగరం మన కళ్లముందే సాక్షాత్కరించబోతోంది.