News June 20, 2024

ప్రజావాణిలోనే కాదు మిగిలిన రోజుల్లోనూ కలవొచ్చు: కలెక్టర్

image

పెద్దపల్లి జిల్లా ప్రజలు ప్రజావాణి కార్యక్రమంలోనే కాకుండా మిగిలిన పని దినాల్లో కూడా తనను కలవొచ్చని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. మంగళవారం నుంచి శనివారం వరకు పని దినాల్లో సమీకృత జిల్లా కలెక్టరేట్‌లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్లో సాయంత్రం 3 నుంచి 5 గంటల వరకు తాను అందుబాటులో ఉంటానని అన్నారు. ప్రజలు నేరుగా వారి సమస్యలను తెలుపవచ్చని కలెక్టర్ తెలిపారు.

Similar News

News September 10, 2024

కరీంనగర్: ఎమ్మెల్సీ పదవికి ఎత్తుగడలు!

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికలు త్వరలోనే జరగనున్నాయి. ప్రస్తుత ఎమ్మెల్సీ పదవీకాలం మార్చి 29తో ముగియనుంది. ఈ క్రమంలో సెప్టెంబర్ 30 నుంచి ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంభించాలని కేంద్రం ప్రకటన జారీ చేసింది. దీంతో ప్రధాన పార్టీలు బలమైన నాయకులను పోటీలో దింపేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఆశావహులు కూడా పోటీలో నిలబడేందుకు ఎత్తుగడలు వేస్తున్నారు.

News September 10, 2024

జగిత్యాల: విష జ్వరంతో విద్యార్థి మృతి

image

విష జ్వరంతో విద్యార్థి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. ధర్మపురి మండల కేంద్రంలో హనుమాన్ వీధికి చెందిన గజ్జల రామ్ చరణ్(10) 4వ తరగతి చదువుతున్నారు. వారం రోజులుగా జ్వరం రావడంతో కరీంనగర్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. ఆసుపత్రిలో వైద్యం వికటించడంతోనే తమ కుమారుడు మృతి చెందాడని బాలుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

News September 10, 2024

బ్యాటరీ సైకిల్ ఇవ్వాలని ప్రజావాణిలో వికలాంగుడి నిరసన

image

తనకు వికలాంగుల పెన్షన్ తో పాటుగా బ్యాటరీ సైకిల్ ఇవ్వాలని ఓ దివ్యాంగుడు జగిత్యాల కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశాడు. కథలాపూర్ మండలం సిరికొండ గ్రామానికి చెందిన సాయిలు అయిదేళ్ల క్రితం ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయాడు. అప్పటి నుంచి పనులకు వెళ్లలేక కుటుంబాన్ని పోషించుకోలేక ఇబ్బంది పడుతున్నట్లు వాపోయాడు.