News December 11, 2024

ప్రజావాణిలో 27వేలకు పైగా సమస్యలకు పరిష్కారం:భట్టి

image

ప్రజావాణిలో 27వేలకుపైగా సమస్యలకు పరిష్కారించినట్లు డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. ఈ నెల 8వ తేదీకి సరిగ్గా ప్రజావాణి కార్యక్రమం మొదలుపెట్టి ఏడాది అయింది. ఈ సందర్భంగా వార్షిక రిపోర్ట్​ను ప్రభుత్వం రిలీజ్​ చేసింది. ప్రజావాణికి ఇప్పటివరకూ మొత్తం 82,955 అప్లికేషన్లు వచ్చాయి. ఇందులో గ్రీవెన్స్​కు సంబంధించినవి 43, 272 ఉండగా.. 62 శాతం పరిష్కారమయ్యాయన్నారు. మిగతావి ప్రాసెస్‌లో ఉన్నట్టు వెల్లడించారు.

Similar News

News December 5, 2025

ఖమ్మం: విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి

image

విద్యుత్ షాక్‌తో ఓ యువకుడు మృతి చెందిన ఘటన గురువారం చింతకాని మండలంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. నేరడకు చెందిన కంచం డేవిడ్(20) తన ఇంట్లో కరెంటు మీటర్ రిపేర్ చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. డేవిడ్ మృతితో వారి కుటుంబంతో పాటు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News December 5, 2025

చంద్రుగొండలో రేషన్ బియ్యం పట్టివేత

image

చంద్రుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ స్థాయిలో రేషన్ బియ్యం అక్రమ రవాణాను పోలీసులు అడ్డుకున్నారు. వాహన తనిఖీల్లో భాగంగా 280 క్వింటాళ్ల రేషన్ బియ్యం (విలువ రూ.5.60 లక్షలు) స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ అరుణ్‌కుమార్, రాజ్‌బార్ విచారణలో బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి ఛత్తీస్‌గఢ్‌కు అధిక ధరలకు తరలిస్తున్నట్లు ఒప్పుకొన్నారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

News December 5, 2025

ఖమ్మం: గంజాయి నిందితులకు జైలు శిక్ష

image

గంజాయి నిందితులకు జైలు శిక్షతోపాటు జరిమానా విధిస్తూ మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ఉమాదేవి తీర్పునిచ్చారు. ఖమ్మం-వరంగల్‌ క్రాస్‌ రోడ్డుతో పాటు కొత్త బస్టాండ్ వద్ద గంజాయి తరలిస్తూ 2022 ఏప్రిల్ 10, 2024 జనవరి 10న నిందితులు పట్టుబడ్డారు. కేసు నమోదు చేసిన పోలీసులు వారిని గురువారం కోర్టులో హాజరు పరచారు. ఒక్కొక్కరికి 20, 10 సం.ల జైలు శిక్షలతో పాటు రూ.లక్ష చొప్పున జరిమానా విధించారు.