News April 8, 2024
ప్రజావాణి కార్యక్రమం రద్దు: జిల్లా కలెక్టర్
నేడు కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు వరంగల్ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య తెలిపారు. అధికారులు, సిబ్బంది పార్లమెంట్ ఎన్నికల విధుల్లో నిమగ్నమై ఉన్నందున రద్దు చేస్తున్నట్లు వివరించారు. ఈ విషయాన్ని గమనించి జిల్లా నుంచి ప్రజలు ఫిర్యాదులు ఇవ్వడానికి కలెక్టరేట్ కార్యాలయానికి రాకూడదని కలెక్టర్ కోరారు.
Similar News
News December 27, 2024
ALERT.. వరంగల్: డిగ్రీ విద్యార్థులకు గమనిక
కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ విద్యార్థులకు నేడు జరగబోయే మొదటి, ఐదవ సెమిస్టర్‌కు సంబంధించిన పరీక్షలు వాయిదా వేసినట్లు రిజిస్ట్రార్ మల్లారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. వాయిదా పడిన పరీక్షలు ఈనెల(డిసెంబర్) 31న నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. తదుపరి పరీక్షలు యథావిధిగా షెడ్యూల్ ప్రకారం ఉంటాయని అన్నారు.
News December 27, 2024
నర్సంపేట: రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థి మృతి.. UPDATE
బైకును కారు ఢీకొట్టడంతో <<14990389>>బీటెక్ విద్యార్థి<<>> మృతి చెందిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాలు.. BHPLకి చెందిన శివరాజ్ కుమార్, వైజాగ్‌కు చెందిన శేషు, KNRకు చెందిన అభిరామ్ NSPT బిట్స్ కాలేజీలో చదువుతున్నారు. ఈ క్రమంలో నిన్న రాత్రి ముగ్గురు యువకులు బైకుపై వెళ్లొస్తుండగా ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శివరాజ్ మృతి చెందగా.. గాయాలపాలైన శేషు, అభిరామ్‌ను ఎంజీఎంకు తరలించారు.
News December 27, 2024
జనగామ: ఈ లాయర్ ఎఫెక్ట్.. మాజీ కలెక్టర్, అధికారులపై FIR
జనగామ మాజీ కలెక్టర్ శివలింగయ్యతో పాటు మరో 11 మంది<<14987938>> అధికారులపై ఎఫ్ఐఆర్ <<>>నమోదైన విషయం తెలిసిందే. అయితే ఈ కేసు విషయంలో రాచకొండ ప్రవీణ్ కుమార్ అనే న్యాయవాది అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సునీత పక్షాన వాదించి ఆమె ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని ఆధారాలతో రుజువు చేశారు. దీంతో అధికారులపై అధికార దుర్వినియోగానికి పాల్పడిన కేసు నమోదు చేయడంలో కీలక పాత్ర పోషించారు.