News March 18, 2025
ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు వినియోగించుకోవాలి: అడిషనల్ కలెక్టర్లు

మహబూబాబాద్ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో అడిషనల్ కలెక్టర్లు లెనిన్ వత్సల్ టోప్పో, వీరబ్రహ్మచారి వినతులు స్వీకరించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే ఏ పథకాలలోనైన లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉంటుందని, సమస్యలను సత్వరమే పరిష్కరించడం కోసం ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. అధికారులు పాల్గొన్నారు.
Similar News
News November 11, 2025
స్థిరాస్తి అమ్మకం సేవా పన్ను పరిధిలోకి రాదు: SC

స్థిరాస్తి అమ్మకాలు సర్వీస్ ట్యాక్స్ పరిధిలోకి రావని SC స్పష్టం చేసింది. సహారా కంపెనీకి ‘ఎలిగెంట్ డెవలపర్స్’ 2002-05లో గుజరాత్, హరియాణా, MHలోని తన భూములను అవుట్రైట్ సేల్ చేసింది. అయితే ‘రియల్ ఏజెంటు’గా అమ్మినందున ₹10.28CR సర్వీస్ ట్యాక్స్ కట్టాలని DGCEI నోటీసులు ఇచ్చింది. వీటిని సంస్థ సవాల్ చేయగా CESTAT రద్దుచేసింది. దీనిపై సర్వీస్ ట్యాక్స్ కమిషనర్ దాఖలు చేసిన పిటిషన్పై SC తాజా తీర్పు ఇచ్చింది.
News November 11, 2025
ఇంజినీర్ పోస్టులకు RITES నోటిఫికేషన్

రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్( <
News November 11, 2025
మెట్పల్లి: తండ్రిని హత్య చేసిన కుమారుడి అరెస్టు

మెట్పల్లి పట్టణంలోని దుబ్బవాడలో ఎల్లగంగ నరసయ్య(74)ను హత్య చేసిన ఆయన కుమారుడు ఎల్ల అన్వేష్(32)ను మంగళవారం అరెస్టు చేసినట్లు ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు. తండ్రి పెళ్లి చేయలేదని, ఏదైన పనిచేయమని ఒత్తిడి చేయడంతోనే హత్యకు పాల్పడినట్లు వివరించారు. నిందితుడి నుంచి హత్యకు ఉపయోగించిన కర్ర, మొబైల్ ఫోన్, ధరించిన దుస్తులను స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు.


