News August 23, 2024
ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యత ఇవ్వాలి: అదనపు కలెక్టర్
ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్ తెలిపారు. శుక్రవారం మధిర మండల తహసీల్దార్ కార్యాలయంలో అదనపు కలెక్టర్, ధరణి పెండింగ్ దరఖాస్తులు, ప్రజావాణి అర్జీల పరిష్కారం, ఓటరు జాబితా సవరణ పై రెవెన్యూ అధికారులతో మధిర నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజావాణి దరఖాస్తులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు.
Similar News
News September 19, 2024
బూర్గంపాడు ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించిన జిల్లా కలెక్టర్
బూర్గంపహాడ్‌లోని ఆసుపత్రిని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో వార్డులు పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చిన రోగులను వివరాలు, సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. రికార్డులు పరిశీలించారు. ఆసుపత్రి సిబ్బందికి తగు సూచనలు చేశారు. నూతనంగా నిర్మించిన టాయిలెట్లు డిజైన్ పరిశీలించారు. ఆయన వెంట తహశీల్దార్ ముజాహిద్, ఆస్పత్రి సూపర్డెంట్ ముక్తేశ్వరరావు ఉన్నారు.
News September 18, 2024
కొత్తగూడెం: ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన అధికారి
కొత్తగూడెం కలెక్టరేట్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రూ.1 లక్షా 14 వేలు లంచం తీసుకుంటున్న హార్టికల్చర్ అధికారి సూర్యనారాయణను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. డ్రిప్ ఇరిగేషన్‌కు సంబంధించిన సబ్సిడీ పొందెందుకు సర్టిఫై కోసం లంచం తీసుకుండగా ఏసీబీ దాడులు నిర్వహించింది. సూర్యనారాయణను అదుపులోకి తీసుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ వెల్లడించారు.
News September 18, 2024
19.8 అడుగుల వద్ద నిలకడగా ప్రవహిస్తున్న గోదావరి
భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు 19.8 అడుగుల వద్ద నిలకడగా ప్రవహిస్తోందని సీడబ్ల్యుసీ అధికారులు ప్రకటించారు. కొద్ది రోజులుగా వర్షాలు లేకపోవడంతో గోదావరి వద్ద నీటి మట్టం తగ్గుముఖం పడుతోంది. ప్రస్తుతం భద్రాచలం గోదావరిలో పటిష్ఠ బందోబస్తు నడుమ వినాయక నిమజ్జనాలు కొనసాగుతున్నాయి.