News October 29, 2024

ప్రజావాణి దరఖాస్తులకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పించాలి: కలెక్టర్

image

ఖమ్మం: ప్రజావాణిలో ప్రజలు ఇచ్చిన దరఖాస్తులకు ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చి త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి సందర్భంగా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అదనపు కలెక్టర్ పి. శ్రీజతో కలిసి ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ప్రజల యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

Similar News

News December 1, 2025

ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటన
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్ తిరిగి ప్రారంభం
∆} ఖమ్మం నూతన డీసీసీ అధ్యక్షుడు ప్రమాణస్వీకారం
∆} రెండో రోజు కొనసాగుతున్న రెండో విడత నామినేషన్లు
∆} మధిర మృత్యుంజయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} ఖమ్మం జిల్లాకు వర్ష సూచన
∆} పలు శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం.

News November 30, 2025

ఎన్నికలు.. ప్రజావాణి తాత్కాలిక రద్దు: ఖమ్మం కలెక్టర్‌

image

ఖమ్మం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల పనుల్లో అధికారులు, సిబ్బంది నిమగ్నమై ఉన్నందున, కలెక్టరేట్‌లో ప్రతి వారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి ఆదివారం ప్రకటించారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రజావాణి నిలిపివేయబడుతుందని కలెక్టర్‌ పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రజలు అందరూ గమనించి, సహకరించాలని ఆయన సూచించారు.

News November 30, 2025

ఖమ్మం BRSలో మరోసారి వర్గ విభేదాలు బహిర్గతం

image

ఖమ్మం BRSలో అంతర్గత వర్గపోరు మరోసారి బహిర్గతమైంది. నిన్నటి ‘దీక్షా దివస్‌’లో మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, జిల్లా అధ్యక్షుడు తాతా మధు, మాజీ MLAలు ఎవరికి వారుగా వ్యవహరించారు. మొదట తాతా మధు, సండ్ర, కందాల అమరవీరుల స్తూపానికి నివాళి అర్పించగా, తరువాత భారీ బైక్‌ ర్యాలీతో పువ్వాడ బల ప్రదర్శన చేసుకున్నారు. అనంతరం పార్టీ కార్యాలయ వేడుకల్లోనూ ఎవరికి వారే అన్నట్లు ఉండటంతో కార్యకర్తల్లో గందరగోళం నెలకొంది.