News April 7, 2025
ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి: కలెక్టర్

ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే ఆదేశించారు. సోమవారం ASF కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆర్డీవోతో కలిసి అర్జిదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించే విధంగా సంబంధిత అధికారులు సమన్వయంతో కృషి చేయాలన్నారు.
Similar News
News November 21, 2025
ఎనుమాముల మార్కెట్ వద్ద ఫిట్స్తో వ్యక్తి మృతి

వరంగల్ ఎనుమాముల మార్కెట్ వద్ద ఫిట్స్ వచ్చి ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడిని దేశాయిపేటకు చెందిన చంద్రమౌళి (40)గా గుర్తించారు. మార్కెట్లో పనిచేసే చంద్రమౌళి ప్రతిరోజూ లాగే బైక్పై వస్తుండగా, మార్కెట్ ముందు ఫిట్స్ రావడంతో బండి మీద నుంచి కింద పడి మృతి చెందాడు. చంద్రమౌళికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
News November 21, 2025
హ్యాపీగా ఉండాలంటే ఈ ఫుడ్స్ తినండి

మనల్ని ఆనందంగా ఉంచే హార్మోన్ అయిన డోపమైన్ ఆహారంలోనూ దొరుకుతుందంటున్నారు నిపుణులు. ఆ ఫుడ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.. బెర్రీస్, అరటిపండ్లు, నట్స్, ఫ్యాటీ ఫిష్, ప్రోబయాటిక్స్, ఓట్స్, ఆకుకూరలు, గుడ్లు, అవకాడో వంటివి ఆహారంలో చేర్చుకోవడంవల్ల ఆరోగ్యం, జ్ఞాపకశక్తి మెరుగవుతుంది. వీటి వల్ల మూడ్ బాగుండటమే కాకుండా మెంటల్ క్లారిటీ, డిప్రెషన్ లక్షణాలు తగ్గించి ఎమోషనల్ హెల్త్ బావుండేలా చూస్తాయంటున్నారు నిపుణులు.
News November 21, 2025
బాపట్ల: నూతన అక్రిడిటేషన్లకు దరఖాస్తుల ఆహ్వానం

బాపట్ల జిల్లాలో పనిచేస్తున్న పాత్రికేయులకు రెండేళ్ల కాలపరిమితికి జారీ చేసే నూతన అక్రిడిటేషన్లకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కలెక్టర్ వినోద్ కుమార్ గురువారం ప్రకటన విడుదల చేశారు. దరఖాస్తులను http://mediarelations.apgov.in లో సమర్పించాలన్నారు. అర్హత కలిగిన పాత్రికేయులు పూర్తి వివరాలను వెబ్సైట్లో ఈ నెల 21 నుంచి నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు.


