News January 31, 2025

ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ఖూనీ చేస్తోంది: డి.రాజా

image

కేంద్రంలో ప్రజావ్యతిరేక పాలన సాగుతోందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా ఆరోపించారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ మతం పేరుతో ప్రజల మధ్య బీజేపీ చిచ్చు పెడుతోందని ఆరోపించారు. ప్రభుత్వాన్ని గద్దె దించాలని దీనికోసం వామపక్ష, లౌకిక పార్టీలతో కలిసి పనిచేస్తామని ప్రకటించారు. మార్చి 23 నుంచి ఏప్రిల్ 14 వరకు దేశవ్యాప్త రాజకీయ ప్రచార ఉద్యమం చేపడతామన్నారు.

Similar News

News February 20, 2025

విశాఖ నుంచి తిరుపతికి ప్రత్యేక రైళ్లు

image

విశాఖ నుంచి తిరుపతికి వీక్లీ స్పెషల్ (08583/84)ప్రత్యేక రైళ్లను వేయడం జరిగిందని వాల్తేర్ డివిజన్ డీసీఎం సందీప్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 24 నుంచి ఏప్రిల్ 28 వరకు ప్రతి సోమవారం వీక్లీ ట్రైన్ ఉంటుందన్నారు. సోమవారం రాత్రి 7గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.15 గంటలకు తిరుపతి చేరుతుందన్నారు. తిరిగి మరుసటి రోజు తిరుపతి నుంచి విశాఖ బయలుదేరుతుంది. ప్రయాణికులు ఈ విషయం గమనించాలన్నారు.

News February 19, 2025

విశాఖపట్నం టుడే టాప్ న్యూస్

image

☞ పెందుర్తి నర్సింగ్ హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్ ☞మధురవాడ: మహిళ హత్య కేసులో నిందితుడి అరెస్ట్ ☞కాపులుప్పాడ వద్ద అస్తిపంజరం కలకలం ☞ఎమ్మెల్సీ అభ్యర్థి రఘువర్మకే టీడీపీ మద్దతు: ఎంపీ ☞విశాఖ: పెళ్లి జరిగిన రెండు వారాలకే పరార్ ☞మధురవాడలో ఉరేసుకుని మహిళ మృతి ☞నేటి నుంచే పూర్ణామార్కెట్ దుర్గాలమ్మ జాతర ☞దువ్వాడలో ఏడుగురు ఇంజినీరింగ్ విద్యార్థుల సస్పెండ్

News February 19, 2025

ఇళ్ల నిర్మాణాల్లో నాణ్య‌త‌కు పెద్ద‌పీట వేయాలి: జిల్లా కలెక్టర్

image

ఎన్.టి.ఆర్. కాల‌నీల్లో జ‌రుగుతున్న ఇళ్ల నిర్మాణాల నాణ్య‌త విష‌యంలో రాజీప‌డ‌కుండా ప‌నుల‌ను వేగ‌వంతంగా చేయాల‌ని జిల్లా క‌లెక్టర్ ఎం.ఎన్. హ‌రేంధిర ప్ర‌సాద్ పేర్కొన్నారు. బుధ‌వారం స్థానిక క‌లెక్ట‌రేట్ మీటింగ్ హాలులో ఇళ్ల నిర్మాణాల పురోగ‌తి, ఇసుక స‌ర‌ఫ‌రా, మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న తదిత‌ర అంశాల‌పై ఆయన స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. అధికారులందరూ బాధ్యత వహించాలని అన్నారు.

error: Content is protected !!