News March 4, 2025
ప్రజా అర్జీలను వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్

రఘునాథపాలెం: ప్రజావాణిలో వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లతో కలిసి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఆయా శాఖలకు వచ్చిన అర్జీలను మరొకమారు పరిశీలన చేసి, పెండింగ్ లో లేకుండా పరిష్కరించాలని ఆదేశించారు.
Similar News
News March 4, 2025
ఖమ్మం: ఇంటర్ పరీక్షలు.. 72 కేంద్రాలు ఏర్పాటు

ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లాలో 36,600మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానుండగా 72 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఖమ్మం డీఐఈఓ కె.రవిబాబు తెలిపారు. ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాల నిఘా ఉంటుందని, హాల్ టికెట్ నేరుగా డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించగా, దానిపై సెంటర్ చిరునామా తెలుసుకునేలా క్యూఆర్ కోడ్ ఉంటుందన్నారు.
News March 4, 2025
ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద 163 BNSS అమలు: సీపీ

ఖమ్మం కమిషనరేట్ పరిధిలో ఇంటర్మీడియట్ పరీక్షల నేపథ్యంలో మార్చి 5 నుంచి 25 వరకు పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS యాక్ట్ అమలులో ఉంటుందని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 200 మీటర్ల పరిధిలో ఐదుగురికి మించి గుంపులుగా ఉండకూడదని, సమావేశాలు, ర్యాలీలు, మైకుల వినియోగం నిషేధించామని తెలిపారు. పరిసరాల్లోని ఇంటర్నెట్ సెంటర్లు, జిరాక్స్ షాపులు మూసివేయాలని ఆదేశించారు.
News March 4, 2025
రఘునాథపాలెం: యువకుడి ఆత్మహత్య.. వ్యక్తి అరెస్టు

రఘునాథపాలెం మండలంలోని చిమ్మపూడికి చెందిన జనబాయి వెంకటేష్ ఆత్మహత్య కేసులో ఇదే మండలం కోటపాడుకు చెందిన బట్ట నాగేశ్వరావును సోమవారం అరెస్టు చేసినట్లు రఘునాథపాలెం సీఐ ఉస్మాన్ షరీఫ్ తెలిపారు. చిమ్మపూడికి చెందిన పాపయ్య కుమారుడు వెంకటేష్‌ను నాగేశ్వరరావు అసభ్యకర పదజాలంతో దూషించాడని ఆత్మహత్య చేసుకున్నాడు. పాపయ్య ఫిర్యాదు చేయగా విచారణ అనంతరం నిందితుడిని అరెస్టు చేశామన్నారు.