News September 13, 2024
‘ప్రజా పాలన దినోత్సవానికి ఏర్పాట్లు చేయండి’
జిల్లా కేంద్రంలో ప్రజా పాలన దినోత్సవాన్ని నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. గురువారం నారాయణపేట కలెక్టరేట్ లో అధికారులతో కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. ఎస్పీ పరేడ్ మైదానంలో సెప్టెంబర్ 17న ప్రజా పాలన దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గుర్నాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని తెలిపారు.
Similar News
News November 17, 2024
MBNR: TGPSCకి వినతి పత్రం ఇచ్చిన అభ్యర్థులు
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన పలువురు గ్రూప్-4 అభ్యర్థులు ఆదివారం రోజు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను కలిశారు. ఇటీవల విడుదల చేసిన గ్రూప్-4 ఫలితాలలో తమకంటే మార్కులు తక్కువ వచ్చిన అభ్యర్థులకు జాబ్ వచ్చిందని.. మార్కులు ఎక్కువ ఉన్నప్పటికీ తాము జాబ్ కోల్పోయామన్నారు. ఏ పద్ధతిన సెలక్షన్ ప్రాసెస్ జరిగిందో తెలిపాలని వారు బోర్డుకు వినతి పత్రాన్ని అందించారు.
News November 17, 2024
NGKL జిల్లాలో కారు బీభత్సం.. ఒకరు మృతి
పెద్దకొత్తపల్లి మండలంలోని రోడ్డు ప్రమాదం జరిగింది. NGKL నుంచి కొల్లాపూర్ వైపు వెళ్తున్న కారు వేగంగా కుడికిల్లకి చెందిన నిరంజనమ్మ కల్వకోల్ గ్రామం రహదారి వద్ద కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది. కారు డ్రైవర్ పరార్ కావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతురాలికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.
News November 17, 2024
MBNR: గ్రూప్-3 అభ్యర్థులకు సూచనలు..
✓అభ్యర్థులు హాల్‌టికెట్‌ను ఏ-4 సైజ్ కలర్ ప్రింట్ తీసుకోవాలి. ✓హాల్‌టికెట్‌పై పాస్‌పోర్టు సైజ్ ఫొటో అతికించాలి. ✓హాల్‌టికెట్‌పై ఫొటో సరిగ్గా ముద్రించకుంటే గెజిటెడ్ అధికారి అటెస్టేషన్తో 3పాస్‌పోర్టు సైజ్ ఫొటోలతోపాటు, వెబ్సైట్లో పొందుపర్చిన ధ్రువీకరణ పత్రాన్ని పూర్తిచేసి ఇన్విజిలేటర్‌కు అందించాలి. ✓బ్లూ,బ్లాక్ బాల్ పెన్ ఉపయోగించాలి✓ఎలక్ట్రానిక్ పరికరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు.