News December 3, 2024

ప్రజా ఫిర్యాదులకు ప్రథమ ప్రాధాన్యత: ప్రకాశం SP

image

సమాజంలోని సామాన్య ప్రజలు, వివిధ రకాల కారణాలతో వచ్చే బాధితుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ దామోదర్ ఆధ్వర్యంలో ప్రజాసమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదు దారుల అర్జీలను పోలీసు ఉన్నదాధికారులు స్వయంగా స్వీకరించారు. వారితో ముఖాముఖిగా మాట్లాడి త్వరగా న్యాయం జరిగేలా చూస్తామన్నారు.

Similar News

News January 7, 2026

9న ఒంగోలులో జాబ్ మేళా..రూ.22వేల శాలరీ!

image

ఒంగోలులోని జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈనెల 9వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి రమాదేవి తెలిపారు. ఒంగోలులోని తన కార్యాలయంలో బుధవారం ఆమె మాట్లాడుతూ.. ప్రముఖ కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొంటున్నాయని, 18 నుంచి 30ఏళ్ల మధ్యగల యువతీ, యువకులు పాల్గొనవచ్చని తెలిపారు. 10 నుంచి ఏదైనా డిగ్రీ పూర్తిచేసిన వారు అర్హులని, నియమితులైనవారికి 22వేల వరకు వేతనం పొందే అవకాశం ఉందన్నారు.

News January 7, 2026

రామాయపట్నం పోర్టు పనులపై జిల్లా కలెక్టర్ సమీక్ష

image

గుడ్లూరు మండలం రామాయపట్నం పోర్టు నిర్మాణ పనులపై ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు బుధవారం సమీక్ష నిర్వహించారు. పోర్టు నిర్మాణ ప్రాంతంలో అధికారులతో సమావేశమైన ఆయన ప్రస్తుత పనుల పురోగతి, భూసేకరణ స్థితిగతులపై ఆరా తీశారు. డ్రెడ్జింగ్, బెర్త్ వర్క్స్, ఆన్‌షోర్ వర్క్స్, రైల్వే లైన్ నిర్మాణం, రోడ్డు పనుల పురోగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ప్రాజెక్టు పనులు త్వరలో పూర్తిచేయాలని ఆదేశించారు.

News January 7, 2026

మార్కాపురం: హౌసింగ్ కార్పొరేషన్ జిల్లా అధికారి ఇతనే.!

image

మార్కాపురం జిల్లా హౌసింగ్ కార్పొరేషన్ జిల్లా అధికారిగా శ్రీనివాస ప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వ హౌసింగ్ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు సమర్థవంతంగా చేరేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న గృహ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. నాణ్యతతో గృహాల నిర్మాణం పూర్తి చేయడమే లక్ష్యంగా పని చేస్తామని అన్నారు.