News January 27, 2025
ప్రజా ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించాలి: కలెక్టర్

ప్రజా ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించి నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. మండల, డివిజన్, మున్సిపల్ స్థాయిలో జరిగిన పీజీఆర్ఎస్ మినిట్స్ సీఎంవో పీజీఆర్ఎస్ గ్రూపులో నోడల్ అధికారికి పోస్ట్ చేయాలన్నారు. రీ సర్వే గ్రామసభలు, రెవెన్యూ సదస్సుల ద్వారా స్వీకరించిన దరఖాస్తులను వెబ్ పోర్టల్‌లో అప్లోడ్ చేసి, నిర్ణీత వ్యవధిలోగా పరిష్కరించడంతో పాటు ఆడిట్ చేయాలన్నారు.
Similar News
News February 23, 2026
మెట్రో ఇక సర్కారు సొంతం.. ఎల్&టీతో ‘సెటిల్మెంట్’

TG: హైదరాబాద్ మెట్రో రైలుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రోను పూర్తిగా తన చేతుల్లోకి తీసుకోవాలని క్యాబినెట్ నిర్ణయించింది. ఎల్&టీకి ఉన్న రూ.13,000 కోట్ల అప్పును ప్రభుత్వమే భరిస్తుందని సమాచారం. అలాగే ఆ సంస్థకు ఈక్విటీ కింద రూ.2,000 కోట్లు చెల్లించనున్నట్లు తెలుస్తోంది. మార్చి 31 లోపు ఈ ప్రక్రియ పూర్తి చేసి, రెండో దశ విస్తరణకు కేంద్రం నుంచి నిధులు రాబట్టేందుకు చర్యలు చేపట్టనుంది.
News February 23, 2026
జగిత్యాల జిల్లాలో ముందస్తు చర్యలు: ఎస్.ఈ

జగిత్యాల జిల్లా విద్యుత్ వినియోగదారులకు వేసవిలో మెరుగైన, నాణ్యమైన, నిరంతర సరఫరా అందించేందుకు అన్ని స్థాయిల్లో ముందస్తు చర్యలు చేపట్టినట్లు ఎస్.ఈ. బి.సుదర్శనం తెలిపారు. 45 ఓవర్‌లోడ్ ట్రాన్స్‌ఫార్మర్లు,96 కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు, 9 పవర్ ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేశామన్నారు. 2 కొత్త సబ్‌స్టేషన్ల నిర్మాణం చేపట్టి, అవసరమైన చోట17 కొత్త బ్రేకర్లు అమర్చామన్నారు. ఇంటర్‌లింక్ లైన్ మెరుగుపర్చామన్నారు.
News February 23, 2026
ఏపీ పోలీసులపై పట్నా హైకోర్టు ఆగ్రహం

IPS సునీల్ కుమార్ నాయక్ అరెస్ట్ విషయంలో AP పోలీసుల తీరుపై పట్నా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బిహార్ పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా, అరెస్ట్ వారెంట్ లేదా కేస్ డైరీ వెంట లేకుండా సునీల్‌ను అరెస్ట్ చేయడాన్ని తప్పుపట్టింది. ఈ నేపథ్యంలో ట్రాన్సిట్ రిమాండ్ ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో ఆయన అరెస్ట్ చెల్లదు. కాగా రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సునీల్ నిందితుడిగా ఉన్నారు.


