News September 16, 2024
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక రద్దు: కలెక్టర్
ఈద్ – ఎ -మిలాద్ ఉన్ నబీ ప్రభుత్వ సెలవు దినం కావడం వలన సెప్టెంబర్ 16న సోమవారం తిరుపతి కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం ఉండదని కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు సోమవారం వినతులతో జిల్లా కలెక్టరేట్ కూ వ్యయ ప్రయాసాలకోర్చి రావొద్దని, ఈ అంశాన్ని ప్రజలు గమనించాలని ఆ ప్రకటనలో కోరారు.
Similar News
News October 9, 2024
మదనపల్లె జిల్లా ఇప్పుడే కాదు: చంద్రబాబు
కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. 30 జిల్లాలుగా మారుస్తామనే ప్రచారంలో వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు. మదనపల్లె, మార్కాపురం జిల్లాపై తాము హామీలు ఇచ్చామన్నారు. ఆయా జిల్లాలు కూడా ఇప్పుడే ఏర్పాటు చేయబోమని తెలిపారు. ఎన్నికలకు ముందే పుంగనూరు, మదనపల్లె, తంబళ్లపల్లె, పీలేరుతో కలిపి మదనపల్లె జిల్లా ఏర్పాటు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.
News October 9, 2024
చిత్తూరు నూతన DFOగా భరణి
చిత్తూరు జిల్లా నూతన అటవీశాఖ అధికారిణిగా భరణి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో పనిచేస్తున్న చైతన్య కుమార్ రెడ్డిని ప్రధాన కార్యాలయానికి రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాకినాడ నుంచి బదిలీపై వచ్చిన భరణి నూతన డీఎఫ్‌వోగా బాధ్యతలు స్వీకరించారు. ఆమె మాట్లాడుతూ.. అందరి సహకారంతో అటవీశాఖ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.
News October 9, 2024
12న స్విమ్స్ ఓపీ, ఓటీలకు సెలవు
తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ(స్విమ్స్)కు విజయదశమి సందర్భంగా సెలవు ప్రకటించారు. ఈ నేపథ్యంలో 12వ తేదీ శనివారం ఓపీ, ఓటీ సేవలు అందుబాటులో ఉండవు. స్విమ్స్ అత్యవసర విభాగం(క్యాజువాలిటీ) సేవలు యథాతథంగా కొనసాగుతాయని వీసీ ఆర్.వి.కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు.