News February 15, 2025
ప్రజా సమస్యలపై ప్రతి ఒక్కరూ గళమెత్తాలి: రామకృష్ణ

ప్రజా సమస్యలపై ప్రతి ఒక్కరూ తమ గళం వినిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. గుంతకల్లు పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఆయన సమావేశం నిర్వహించారు. స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై నాయకులు పోరాడాలని సూచించారు. ఎంతో మంది పేదలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం వారిని ఆదుకోవాలని సూచించారు.
Similar News
News March 28, 2025
తండ్రి మరణంలోనూ కుమార్తెకు ‘పరీక్ష’!

తండ్రి మరణంతో దుఃఖాన్ని దిగమింగుకుని పది పరీక్షలకు హాజరైంది ఓ విద్యార్థిని. ఉరవకొండ మం. రాకెట్లకు చెందిన రఘు(48) కూడేరు మండలం గొట్కూరు వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తె రక్షిత పది పరీక్షలు రాస్తోంది. తన పెద్ద కుమార్తెను కాలేజీలో విడిచిపెట్టి తిరిగి బైక్‌పై వస్తుండగా ప్రమాదానికి గురై మృతి చెందారు. తండ్రి లేడన్న బాధను దిగమింగుకుని చిన్నకూతురు పరీక్ష రాసింది.
News March 28, 2025
వైసీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడిగా పెన్నోబులేసు

వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడిగా మాల్యావంతం పెన్నోబులేసును నియమించారు. ఆయన మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు అప్పగించినందుకు జగన్మోహన్ రెడ్డికి, జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. అనంతపురం జిల్లా ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.
News March 28, 2025
ఎన్టీఆర్ పింఛన్లకు రూ.127.76 కోట్లు మంజూరు

అనంతపురం జిల్లాలో ఏప్రిల్ 1న పంపిణీ చేయనున్న ఎన్టీఆర్ సామాజిక భద్రత పింఛన్లు పంపిణీకి రూ.126.76 కోట్లు నిధులు విడుదల చేసినట్లు జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో 2,79,165 మంది లబ్దిదారులకు పింఛన్లు ఇంటి వద్ద పంపిణీ చేయడానికి చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. మొదటి రోజు సాంకేతిక కారణాలతో పంపిణీ జరగకుంటే రెండవ రోజు తప్పనిసరిగా ఇంటివద్ద అందిస్తారని పేర్కొన్నారు.