News December 4, 2024
ప్రజా సమస్యలు పారదర్శకంగా పరిష్కరించాలి: కలెక్టర్

పిజిఆర్‌ఎస్‌లో వచ్చిన ప్రతి ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి, పారదర్శకంగా పరిష్కరించాలని మంగళవారం అధికారులను కడప జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశించారు. అమరావతి నుంచి సి.సి.ఎల్.ఏ.జి జయలక్ష్మి పి.జి.ఆర్.ఎస్ ఫిర్యాదుల పరిష్కారం తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం చేయకుండా త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
Similar News
News March 6, 2026
పులివెందుల సీఐగా శ్రీరామ్

గతంలో ప్రొద్దుటూరులో పనిచేసిన సీఐ శ్రీరామ్‌ను పులివెందుల సీఐగా బదిలీ చేస్తూ కర్నూల్ డీఐజీ కోయ ప్రవీణ్ ఉత్తర్వులు జారీ చేశారు. సీతారామిరెడ్డిని పులివెందుల టౌన్ నుంచి రూరల్‌కు, శాంతిలాల్‌ను కడప వీఆర్ నుంచి పులివెందుల ట్రాఫిక్‌కు బదిలీ చేశారు. శంకర్ రెడ్డిని కడప RSTF నుంచి RK వ్యాలీకి, ఉలసయ్యను RK వ్యాలీ నుంచి కడప వీఆర్‌కు, హాజీవల్లీని పులివెందుల ట్రాఫిక్ నుంచి నంద్యాల DPTCకి బదిలీ చేశారు.
News March 6, 2026
ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్‌పై విచారణ.!

ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డిపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ACB తనిఖీల్లో రవిచంద్రారెడ్డి నంద్యాల మున్సిపల్ కమిషనర్‌గా పనిచేసిన సమయంలో భవన నిర్మాణ అనుమతులు, అక్రమ భవనాలు క్రమబద్ధీకరణ, భవనాలకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు జారీ చేయడంలో అవినీతికి పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై ప్రభుత్వం విచారణకు ఉత్తర్వులు జారీ చేసింది.
News March 6, 2026
కడప: ఓపెన్ ఇంటర్ పరీక్షలకు 5,236 మంది హాజరు.!

కడప జిల్లాలో గురువారం 34 కేంద్రాల్లో ఓపెన్ ఇంటర్ తెలుగు, హిందీ, ఉర్దు పరీక్షలు నిర్వహించారు. నేడు 5,783 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా.. 5,326 మంది విద్యార్థులు హాజరయ్యారు. 711 మంది గైర్హాజరయ్యారు. తెలుగు 5,086 మంది, హిందీ 68 మంది, ఉర్దు పరీక్ష 82 మంది రాశారు. డీఈఓ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఓపెన్ ఇంటర్ పరీక్షలను నిర్వహించారు.


