News September 30, 2024

ప్రజా సమస్యలు సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్ బాలాజీ

image

మచిలీపట్నంలోని జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ బాలాజీ ఆధ్వర్యంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లాకు చెందిన ముఖ్య అధికారులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ.. ప్రజల వద్ద నుంచి స్వీకరించిన సమస్యలకు నాణ్యమైన పరిష్కారం చూసినప్పుడే ప్రజలు సంతృప్తికరంగా ఉంటారన్నారు.

Similar News

News October 15, 2024

కృష్ణానది తీరంలో 22న భారీ డ్రోన్ షో

image

కృష్ణా న‌ది తీరంలో 22న నిర్వ‌హించే భారీస్థాయి డ్రోన్‌షో, లేజర్ షో ఏర్పాట్ల‌కు పెట్టుబ‌డులు, మౌలిక స‌దుపాయాల శాఖ కార్య‌ద‌ర్శి సురేష్ కుమార్‌, జిల్లా క‌లెక్ట‌ర్ సృజ‌న‌ వివిధ శాఖ‌ల అధికారుల‌తో క‌లిసి పున్నమీ ఘాట్ వద్ద క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టించారు. రాష్ట్రాన్ని డ్రోన్ క్యాపిట‌ల్‌గా తీర్చిదిద్దే ఈ కార్యక్రమానికి కేంద్ర, రాష్ట్ర మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పాల్గొననున్నట్లు తెలిపారు.

News October 15, 2024

VJA: మహిళా కానిస్టేబుల్ ఘటనపై ఏసీపీ స్పందన

image

విజయవాడలో మాచవరం పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ భవాని నిద్ర మాత్రలు మింగి గత రాత్రి ఆత్మహత్యకు యత్నించిన <<14360479>>విషయం తెలిసిందే<<>>. ఈ ఘటనపై సెంట్రల్ ఏసీపీ దామోదర్ స్పందించారు. భవాని ఆరోగ్యం స్థిమితంగానే ఉందన్నారు. సీఐ ప్రకాశ్ వేధించారనడం అవాస్తవమన్నారు. భవాని శాఖ పరంగా డ్యూటీ డ్రెస్ కోడ్ పాటించాలని హెచ్చరించినందుకు ఆమె ఆత్మహత్యకు యత్నించిందన్నారు.

News October 15, 2024

విజయవాడలో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం

image

విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కానిస్టేబుల్ ఓపి విధులు నిర్వహిస్తున్నారు. నిన్న రాత్రి నిద్ర మాత్రలు మింగి సూసైడ్‌కు యత్నించారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలయాల్సి ఉంది.